శ్రీకృష్ణదేవరాయల కల

500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయులు పరిపాలించేవాడు. ఆయన ఒక రోజు నిద్రలో ఒక కలగన్నాడు. ఆ కలలో రాయలకొక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ, లక్ష దీపాలతో కాంతులీనుతూ అందంగా, అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయాడు. మరుసటిరోజు సభలో ఆయిన ఆ కలను వివరించి, దాన్ని నిజం చేయాలన్న తన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపాడు. అది […] The post శ్రీకృష్ణదేవరాయల కల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయులు పరిపాలించేవాడు. ఆయన ఒక రోజు నిద్రలో ఒక కలగన్నాడు. ఆ కలలో రాయలకొక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ, లక్ష దీపాలతో కాంతులీనుతూ అందంగా, అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయాడు. మరుసటిరోజు సభలో ఆయిన ఆ కలను వివరించి, దాన్ని నిజం చేయాలన్న తన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపాడు. అది విన్న వారంతా అలాంటి భవనాన్ని ఎలా కట్టగలం? అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

రాయలు కోపగించుకుని ‘అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానం ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి’ అని ఆజ్ఞాపించాడు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరువలేదు. ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయలవారిని ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చాడు.

‘నా దగ్గర నూరు నాణాలున్నాయి స్వామి. అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణాలు అడిగి ఇప్పించండి’ అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయలు ‘ఈ దొంగతనం ఎవరు చేసారు, ఎక్కడ చేసారు’ అని ప్రశ్నించాడు. వృద్ధుడు తడబడడం చూసి ‘నీకేమి భయం లేదు చెప్పు’ అని ప్రోత్సహించాడు. ‘నా నూరు నాణాలు దొంగలించింది మీరే స్వామి’ అన్నాడు వృద్ధుడు.

‘నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు’. రాయలకు చాలా కోపం వచ్చింది. ‘ఏమిటీ వెటకారం! కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా?’ అని కోపంగా అడిగాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేషాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్ధమయ్యేలా చెప్పిన రామకృష్ణను మనస్ఫూర్తిగా అభినందించాడు.

Tenali Ramakrishna Stories in Telugu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శ్రీకృష్ణదేవరాయల కల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.