ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న ఎస్సారెస్పి కాలువలు…

  పునరుజ్జీవ పథకం పనులతో మిగిలిన పనులకు శ్రీకారం వచ్చే ఖరీఫ్‌కు పెరగనున్న ఆయకట్టు వరంగల్ : ఎస్సారెస్పి కాలువల మరమ్మత్తుకు ప్రభుత్వం నడుం బిగించి యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మత్తు పనులను చేపట్టుతుంది. ఇప్పటికే ఉ మ్మడి వరంగల్ జిల్లాలో పునరుజ్జీవ పథకం ద్వారా ప్రధాన కాలువలతో పాటు ఉపకాలువలు కూడా పు నరుజ్జీవ పథకం కింద గత సంవత్సరం నుండి ప నులు కొనసాగుతున్నాయి. గ్రామాల పరిధిలో ఉన్న ఎస్సారెస్పి చిన్నచిన్న కాలువల పనులు […] The post ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న ఎస్సారెస్పి కాలువలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పునరుజ్జీవ పథకం పనులతో మిగిలిన పనులకు శ్రీకారం
వచ్చే ఖరీఫ్‌కు పెరగనున్న ఆయకట్టు

వరంగల్ : ఎస్సారెస్పి కాలువల మరమ్మత్తుకు ప్రభుత్వం నడుం బిగించి యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మత్తు పనులను చేపట్టుతుంది. ఇప్పటికే ఉ మ్మడి వరంగల్ జిల్లాలో పునరుజ్జీవ పథకం ద్వారా ప్రధాన కాలువలతో పాటు ఉపకాలువలు కూడా పు నరుజ్జీవ పథకం కింద గత సంవత్సరం నుండి ప నులు కొనసాగుతున్నాయి. గ్రామాల పరిధిలో ఉన్న ఎస్సారెస్పి చిన్నచిన్న కాలువల పనులు కూడా పూ ర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నెలరోజుల్లో ఆ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఆదేశంతో ఎస్సారెస్పి, ఇరిగేషన్ శాఖాధికారులు పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టిని కేంద్రీకరించారు.

ఎక్కువ శాతం కాలువల్లో పేరుకుపోయిన పూడిక, జంగల్ కటింగ్, గేట్ల మరమ్మత్తులు లాంటి పనులు పూర్తి చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుండి ఎస్సారెస్పి నీటిని చివరికి ఉన్నటువంటి కాలువల వరకు పంపించగలిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్‌పర్తి, ధర్మసాగర్, వేలేరు, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాల నుండి మొదలైన ప్రధాన కాలువలు ములుగు, భూపాలపల్లి, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్ వరకు నీటిని సప్లై చేయించగలిగారు. అదేవిధంగా జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం కూడా నీటిని సప్లై చేశారు. ప్రధాన కాలువలతో పాటు ఉపకాలువలకు నీటిని పంపించలేని పరిస్థితులు ఉన్నచోట మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రధానంగా చెరువులకు ఎస్సారెస్పి కాలువలను అనుసంధానం చేస్తున్నారు.

గోదావరి, ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్నటువంటి గోదావరి జలాలను ఎస్సారెస్పి కాలువలకు మళ్లించి చివరి ఆయకట్టు కూడా నీటిని అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఖరీఫ్ సీజన్ జూన్ నుండి ప్రారంభమవుతున్నందున జులై నెలాఖరు వరకు గోదావరి నీటిని అన్ని చెరువులు, రిజర్వాయర్లకు పంపించడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన సహజరీతిలో ఉన్న కాలువలు, వాగులు, ఎస్సారెస్పి కాలువలు మరమ్మత్తు చేయడానికి పూనుకుంది. పునరుజ్జీవ పథకం ద్వారా మొదలైన పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. మిగిలిన పనులు జూన్, జులై వరకు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అందుకు సంబంధించిన పనులను గ్రామస్థాయిలోనే పూర్తి చేయడానికి ఎంఎల్‌ఎలకు అధికారాన్ని ఇచ్చారు. ఎంఎల్‌ఎల ఆధ్వర్యంలో పనుల పంపిణీ పూర్తి చేసి ఆ పనులను జులై వరకే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెరగనున్న ఆయకట్టు..

గోదావరి జలాలను ఉమ్మడి వరంగల్ జిల్లాకు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో పా టు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. జులై నెలాఖరులో దేవాదుల ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ప్రా జెక్టు నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పి కాలువలకు నీ రు చేరి చివరి ఆయకట్టు వరకు ఆ నీటిని సప్లై చే స్తారు. ఎస్సారెస్పి కాలువలతో తరి, మెత్త పంటలు కూడా తాగునీరు అందనుంది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎస్సారెస్పి కాలువల ప్రస్థానం అనుకున్న ల క్షం నెరవేరనప్పటికి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గోదావరి జలాలతో ఎక్కడ చూసినా ఎస్సారెస్పి కాలువలు నీటితో కలకలలాడే రోజులు జులైలో రానున్నాయి.

ఎస్సారెస్పి కాలువల నిర్మాణ ప్రధాన లక్షం బీడు భూములుగా ఉన్న ప్రాంతాల్లో మెట్ట పంటలకు నీరందించడానికి లక్షంగా కాలువలు త వ్వించారు. ఆ లక్షం గోదావరి జలాలతో తీరబోతు ంది. ఇదిలా ఉంటే దేవాదుల ప్రాజెక్టు జులైకి పూర్తయితే ఆనీటితో కరువు ప్రాంతంగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం జిల్లా సస్యశ్యామలం కానుంది. అ న్నింటికి మించి నర్సంపేట ప్రాంతానికి రూ.700 కో ట్లతో నిర్మాణం జరుగుతున్న పంప్‌హౌజ్‌లు పూర్తి కా నున్నాయి.ఆపంప్‌హౌజ్‌ల నుండి రామప్ప రిజర్వాయర్ ద్వారా రంగాయ చెరువుతో పాటు పాకాల సరస్సుకు నీటిని పంపింగ్ చేస్తారు.

ఈరెండు రిజర్వాయర్‌లతో నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మ ండలాలు మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొ త్తగూడ, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలు స స్యశ్యామలం కానున్నాయి. వాటితో పాటు సమీప, ప ట్టణాలు గ్రామాలకు తాగునీటిని కూడా తీర్చబోతున్నాయి.ఈప్రాజెక్టులతో వరంగల్ జిల్లాలో అనూహ్య ంగా ఆయకట్టు భారీగా పెరగనుంది. మెట్ట పంటలు సైతం తడిపంటలుగా మారే అవకాశం ఉం ది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గా ల్లో తాగునీటి నిల్వలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన ్నందున అరటి చెరకు, మిర్చి, పత్తి, పసుపు లాంటి వాణిజ్య పంటలకు నిలయంగా మారే అవకాశం ఉంది.

SRSP Canals prepared for Kharif

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న ఎస్సారెస్పి కాలువలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.