‘పది’ పర్యాయాలుగా హైదరాబాద్ బాద్‌షా ‘మజ్లిస్’

చాంద్రాయణగుట్ట : హైదరాబాద్ పార్లమెంట్‌లో మజ్లిస్ పార్టీ గత పది పర్యాయాలుగా తన విజయ బావుటాను ఎగురవేస్తుంది. ఆ పార్టీ అధినేత స్వర్గీయ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పాతబస్తీలోని మైనార్టీ(ముస్లీం)లకు పి లిస్తే పలికే నేతగా ఉంటూ వారిని అభ్యున్నతికి విశేష కృషి చేశారు. ఇతర వర్గ ప్రజలు సైతం అతనిని అభిమానించేవారు. దీంతో మైనార్టీలు ఎక్కువగా మజ్లిస్ పార్టీ పట్ల ప్రతి ఎన్నికల్లో అభిమానం చూపారు. చూపుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 1951లో తొలిసారిగా హైదరాబాద్ పార్లమెంట్ […] The post ‘పది’ పర్యాయాలుగా హైదరాబాద్ బాద్‌షా ‘మజ్లిస్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చాంద్రాయణగుట్ట : హైదరాబాద్ పార్లమెంట్‌లో మజ్లిస్ పార్టీ గత పది పర్యాయాలుగా తన విజయ బావుటాను ఎగురవేస్తుంది. ఆ పార్టీ అధినేత స్వర్గీయ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పాతబస్తీలోని మైనార్టీ(ముస్లీం)లకు పి లిస్తే పలికే నేతగా ఉంటూ వారిని అభ్యున్నతికి విశేష కృషి చేశారు. ఇతర వర్గ ప్రజలు సైతం అతనిని అభిమానించేవారు. దీంతో మైనార్టీలు ఎక్కువగా మజ్లిస్ పార్టీ పట్ల ప్రతి ఎన్నికల్లో అభిమానం చూపారు. చూపుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 1951లో తొలిసారిగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఏ ర్పాటు చేశారు.

తొలి ఎన్నికల్లో అహ్మద్ మొహినుద్దీన్ (కాంగ్రెస్) గెలుపొందా రు. 1957లో వినాయక్ రావు కోరాట్కర్ (కాంగ్రెస్), 1962లో గోపాలయ్య సు బ్బకృష్ణ మెల్కోటే (కాంగ్రెస్), 1967లో గోపాలయ్య సుబ్బకృష్ణ మెల్కోటే (కాంగ్రెస్), 1971లో గోపాలయ్య సుబ్బకృష్ణ మెల్కోటే ( తెలంగాణ ప్రజా సమితి), 1977లో కె.ఎస్.నారాయణ (కాంగ్రెస్), 1980లో కె. ఎస్.నారాయణ (కాంగ్రెస్)లు హైదరాబాద్ పార్లమెంట్ ని యోజక వర్గానికి ఎంపీలుగా వ్యవహరించారు. దాదాపు అన్ని పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనుకునే సమయంలో 1984లో స్వతంత్ర అభ్యర్థిగా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పోటీ చేసి ఎంపీగా తొలిసారి ఎన్నికైయ్యారు.

అక్కడి నుంచి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహాద్-ఉల్-ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అభ్యర్థిగా 1989 నుంచి 1991, 1996, 1998, 1999 వరకు ఆరుసార్లు వరస విజయాలతో మజ్లిస్‌కు, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి ధీటులేదని చాటి చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్‌పై ఇతర పార్టీలు ఆశలు పెట్టుకోలేని విధంగా తీర్చిదిద్దారు. చార్మినార్ ఎమ్మెల్యేగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఓవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీని తన స్థానంలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా 2004లో బరిలోకి దింపారు. అన్ని తానై వ్యవహరించి అఖండమైన మెజార్టీతో గెలిపించారు. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఎంపిగా పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసీ 3,78,854 ఓట్లు సాధించగా రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి జి.సుభాష్ చందర్జీకి 2,78,709ఓట్లు లభించాయి.

మూడవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.లకా్ష్మరెడ్డికి 2,49,516 ఓట్లు, నాల్గవ స్థానంలో నిలిచిన మజ్లిస్ బచావో తహరీక్ అభ్యర్థి మాజీదుల్లా ఖాన్‌కు 47,560 ఓట్లు లభించాయి. లక్షా 145 ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. 2009, 2014 పార్లమెంట్ ఎన్నికలలో నిలిచిన ఓవైసీ వరుస విజయాలతో తన పరంపర కొనసాగించి హ్యాట్రిక్ కొట్టారు. 2009లో జరిగిన ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీకి 3,08,061 ఓట్లు రాగా రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి జాహిద్ అలీ ఖాన్‌కు 1,94,196 ఓట్లు లభించాయి. మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పి.లక్ష్మణ్ రావు గౌడ్ 93,917 ఓట్లు, బీజపీ అభ్యర్థి సతీష్ అగర్వాల్‌కు 75,503 ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. అసదుద్దీన్ ఓవైసీ 1,13,865 ఓట్ల మెజార్టీతో జాహెద్ అలీఖాన్‌పై విజయ దుందుభి మోగించారు.

2014లో జరిగిన ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ 5,13,868 ఓట్లు (52.94శాతం) సాధించగా రెండవ స్థానంలో నిలిచిన డాక్టర్ భగవంతరావుకు 3,11,414 ఓట్లు (32.05 శాతం) వచ్చాయి. మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.కృష్ణారెడ్డికి 49,310 ఓట్లు, నాల్గవ స్థానంలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి రాషిద్ షరీఫ్‌కు 37,195 ఓట్లు లభించాయి. అసదుద్దీన్ ఓవైసీ 2,02,454 ఓట్ల మెజార్టీతో భగవంతరావుపై విజయం సాధించారు. 2019లో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 19,57,772 ఓట్లుండగా ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో 8,77,872 ఓట్లు పోలై 44.75 శాతం ఓటింగ్ నమోదైయ్యింది. ఈనెల 23న జరిగిన ఓట్ల లెక్కింపులో మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి 5,17,471 ఓట్లు (58.95)రాగా అతని సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ భగవంతరావుకు 2,35,285 (26.8) ఓట్లు వచ్చాయి. దాదాపు 2,82,186 ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ నాల్గవ సారి విజయం సాధించారు.

మూడవ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్‌కు 63,239 (7.2)ఓట్లు, నాల్గవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ ఫెరోజ్ ఖాన్‌కు 49,944(5.69) ఓట్లు లభించాయి. నాల్గవ సారి ఘన విజయం సాధించిన అసదుద్దీన్ ఓవైసీకి ఆపార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. తండ్రి రాజకీయ అనుభవాలను పునికి పుచ్చుకున్న ఓవైసీ బ్రదర్స్ హైదరాబాద్ పార్లమెంట్‌పై ఏపార్టీ, ఎంత పెద్ద నేత పోటీ చేసినా కంచుకోటను ఎవ్వరూ ఏమి చేయలేరని గత నాలుగు పర్యాయాలుగా నిరూపించారు. నిరూపిస్తూ వస్తున్నారు.

ప్రజా సమస్యలు, మైనార్టీల సంక్షేమానికై ఎప్పటికప్పుడు జాతీయ, రాష్ట్రా స్థాయిలో స్పందిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఓవైసీ బ్రదర్స్ రాజకీయ వ్యూహం ముందు జాతీయ, ప్రాంతీయ పార్టీలు నిలువ జాలవని, అందుకు మజ్లిస్ పార్టీ దాదాపు ఏడు నియోజక వర్గాలలో బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా అఖండ విజయంతో తన తేజస్సును పెంచుకుంటుంది.

AIMIM wins hyderabad parliament seat ten times

The post ‘పది’ పర్యాయాలుగా హైదరాబాద్ బాద్‌షా ‘మజ్లిస్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: