పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి

 కాలువల నిర్మాణం ద్వారానే నీటిని అందించగలం, భూ సేకరణను వేగం పెంచండి : హరీశ్‌రావు సిద్దిపేట: పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం పట్టణంలో ని ఆయన స్వగృహంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నియోజకవ ర్గంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కాలువలు, పిల్ల కాలువల పను […] The post పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
 కాలువల నిర్మాణం ద్వారానే నీటిని అందించగలం, భూ సేకరణను వేగం పెంచండి : హరీశ్‌రావు

సిద్దిపేట: పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం పట్టణంలో ని ఆయన స్వగృహంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నియోజకవ ర్గంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కాలువలు, పిల్ల కాలువల పను లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మూడు మండలాల పలు గ్రామాల్లో కాలువల పనుల సర్వే, భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. వచ్చే ది వానకాలం కావున కాలువల పనులు త్వరగా పూర్తయితే చెక్‌డ్యాంలు, కుంటలు, చెరువులు నిండుతాయన్నారు. భూసేకరణ పూర్తయిన నిర్వాసితులకు అందించే సహాయాన్ని జెసితో మాట్లాడి వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి చెరువు, కుంట నిండేలా కాలువలను అనుసందానం చేసి నీటితో నింపాలన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కాలువల పనులు వేగవంతం చేసే విధంగా ముందుకు వెళ్లాలన్నా రు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: