మొదలైన గో గూండాయిజం

బీఫ్ అనుమానంతో మధ్యప్రదేశ్‌లో ఇద్దరిని చితకబాది జైశ్రీరాం నినాదాలిప్పించిన గోరక్షక దళం సియోనీ : మధ్యప్రదేశ్‌లో గో రక్షకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యానికి దిగారు. బీఫ్ తీసుకుపోతున్నారని ఇద్దరు వ్యక్తులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఈ సం ఘటన సియోనీలోని కున్హివాడా ప్రాంతంలో ని మండ్లా రాదారిలో రెండు రోజుల క్రితం జరిగిం ది. గొడ్డు మాంసం తీసుకుపోతున్నారని ఐదుగురు వ్యక్తు లు ఈ దారిలో వెళ్లుతున్న ఇద్దరిని, వారి వెంట ఉన్న మహిళను […] The post మొదలైన గో గూండాయిజం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
బీఫ్ అనుమానంతో మధ్యప్రదేశ్‌లో ఇద్దరిని చితకబాది జైశ్రీరాం నినాదాలిప్పించిన గోరక్షక దళం

సియోనీ : మధ్యప్రదేశ్‌లో గో రక్షకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యానికి దిగారు. బీఫ్ తీసుకుపోతున్నారని ఇద్దరు వ్యక్తులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఈ సం ఘటన సియోనీలోని కున్హివాడా ప్రాంతంలో ని మండ్లా రాదారిలో రెండు రోజుల క్రితం జరిగిం ది. గొడ్డు మాంసం తీసుకుపోతున్నారని ఐదుగురు వ్యక్తు లు ఈ దారిలో వెళ్లుతున్న ఇద్దరిని, వారి వెంట ఉన్న మహిళను ఆపివేశారు. కర్రలతో ఆ ఇద్దరిని మొదట తీవ్రంగా కొట్టారు. తరువాత ఆ ఇద్దరిలోనే ఒకరితో వెంట ఉన్న మహిళను చెప్పులతో కొట్టించారు.

ఈ మొత్తం ఘటన అంతా సెల్‌ఫోన్ కెమెరాలలో వీడియోగా మారి, సోషల్ మీడియాలో ప్రచారం పొందింది. మధ్యప్రదేశ్‌లో బీఫ్ అమ్మకాల నిషేధం ఉందని, అందుకే బీఫ్‌ను తీసుకుని వెళ్లుతున్న వారిని , దాడికి దిగిన వారిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దుండగులు వారిని కొట్టిన తరువాత అక్కడే నిలబెట్టి వారితో జై శ్రీరాం నినాదాలు చేయించారు. ఈ ఘటనలన్నీ ఈ వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. దాడికి దిగిన వారిపై ఐపిసి పరిధిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సియోనీ పోలీసు సూపరింటెండెంట్ లలిత్ షఖ్యావర్ తెలిపారు.

దాడికి గురయిన వారిని అరెస్టు చేయడంపై విమర్శలు తలెత్తాయి. అయితే బీఫ్ కలిగి ఉండటం కానీ, దానిని తీసుకువెళ్లడం కానీ చట్టరీత్యా నేరం కాబట్టి, వీరి వద్ద బీఫ్ ఉన్నట్లు తేలింది కాబట్టి వీరిని కూడా అదుపులోకి తీసుకోవల్సి వచ్చిందని దుండా సియోనీ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. వారికి పెద్దగా గాయాలేమీ కాలేదని వారి నుంచి 140 కిలోల మాంసం పట్టుకున్నట్లు, ఇది బీఫ్‌గా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వీరిని తమకు తాము గోరక్షకులుగా చెపుతూ దాడి జరుపుతూ ఉండగా వారిలో ఒకరు తమ చర్యను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి, తరువాత సోషల్ మీడియాలో పెట్టినట్లు వెల్లడైంది. ఈ వీడియో ఆధారంగా ఐదుగురిని అరెస్టు చేసినట్లు , కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

gau rakshak beat two for carrying beef in madhya pradesh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మొదలైన గో గూండాయిజం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: