జాతీయ ఆశలు.. ప్రాంతీయ ఆకాంక్షలు

  పేదరికం, అవినీతి అంతమే లక్షం  సుపరిపాలన, చిత్తశుద్ధి చూసే ఓటేశారు  వారి ఆశలకు అనుగుణంగా పనిచేద్దాం  విఐపి సంస్కృతిని వదిలేయండి.. లైన్లలో నిల్చోండి  మీడియా చెప్పినట్టుగా మంత్రి పదవులు రావు  ఎంపిలను ఉద్దేశించి మోడీ  ఎన్‌డిఎ పక్షనేతగా ఎన్నికైన నరేంద్రుడు  రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి న్యూఢిల్లీ: ఎన్‌డిఎ పార్లమెంటరీ పక్షనేతగా నరేంద్రమోడీని ఆ కూటమి లోక్‌సభ సభ్యులు ఎన్నుకున్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమైన కొత్తగా ఎన్నికైన ఎన్‌డిఎ ఎంపిలు […] The post జాతీయ ఆశలు.. ప్రాంతీయ ఆకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పేదరికం, అవినీతి అంతమే లక్షం

 సుపరిపాలన, చిత్తశుద్ధి చూసే ఓటేశారు
 వారి ఆశలకు అనుగుణంగా పనిచేద్దాం

 విఐపి సంస్కృతిని వదిలేయండి.. లైన్లలో నిల్చోండి
 మీడియా చెప్పినట్టుగా మంత్రి పదవులు రావు

 ఎంపిలను ఉద్దేశించి మోడీ
 ఎన్‌డిఎ పక్షనేతగా ఎన్నికైన నరేంద్రుడు

 రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ పార్లమెంటరీ పక్షనేతగా నరేంద్రమోడీని ఆ కూటమి లోక్‌సభ సభ్యులు ఎన్నుకున్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమైన కొత్తగా ఎన్నికైన ఎన్‌డిఎ ఎంపిలు మోడీని రెండోసారి ఎన్‌డిఎ నేతగా ఎన్నికున్నారు. పార్లమెంటరీ పక్షనేతగా మోడీ పేరును బిజెపి జాతీయ అధ్యక్షుడు, గాంధీనగర్ ఎంపి అమిత్ షా ప్రతిపాదించారు. మరో సీనియర్ నాయకుడు, లక్నో ఎంపి రాజ్‌నాథ్ సింగ్, నాగ్‌పూర్ ఎంపి నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్‌డిఎ నేతగా మోడీ పేరును అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్‌సింగ్ బాదల్ ప్రతిపాదించగా.. బీహార్ సిఎం, జెడియు అధినేత నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎల్‌జెపి అధినేత రాంవిలాస్ పాశ్వాన్ బలపరిచారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఎన్‌డిఎ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన మిత్రులకు, తొలిపారి ఎంపిలుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈ ఐదేళ్లలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశామని, అందుకే ప్రజలు ఈ మహత్తర విజయం ఇచ్చి గురుతర బాధ్యత మనందరిమీద ఉంచారన్నారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత్ ప్రజాస్వామ్యం పరిణతి దిశగా పయనిస్తోంది. ఎంత ఉన్నతస్థితికి చేరినా సేవాభావం మరిచిపోం. సేవాభావం ఉన్నంత వరకు ప్రజాదరణ మనకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఎన్‌డిఎ విజయాన్ని కాంక్షించారు. మా చిత్తశుద్ధి, సుపరిపాలన చూసే ప్రజలు ఓటేశారు. నేను కూడా మీలో ఒకడినే అని భావించండి. ప్రజలు మనపై మరోసారి భరోసా ఉంచారు. వారి ఆశలకు అనుగుణంగా పని చేద్దాం’ అని మోడీ ఎంపీలకు సూచించారు. తాజా గెలుపుతో కొత్త భారతాన్ని నిర్మిద్దామని, ఆ దిశగా పయనాన్ని ప్రారంభిద్దామన్నారు. మన కొత్త నినాదం జాతీయ ఆశలు.. ప్రాంతీయ ఆకాంక్షలు అని ఎంపిలకు మోడీ ఉద్భోదిచారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పని చేద్దామని పిలుపునిచ్చారు. .
వడగాలులను సైతం లెక్క చేయకుండా…
ఈ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు కూడా కష్టపడ్డారని, ఎండలు, వడగాలులను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటేశారని మోడీ పేర్కొన్నారు. ఇంత శాతం ఓటింగ్ గతంలో ఎప్పుడూ నమోదు కాలేదని, ఈసారి ఎన్నికల్లో మహిళలు పురుషులతో సమానంగా ఓటేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య మరింత పెరుగుతుందని, అదే విధంగా ఈసారి ఎక్కువ మంది మహిళా ఎంపిలు ఎన్నికయ్యారని ఎంపిల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. 17 రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారని, ఎన్‌డిఎకు దేశ హితమే అన్నింటికంటే ముఖ్యమన్నారు. ఎన్నికల ప్రచార స్థలాలను పుణ్య స్థలాలుగా భావించానని, ఎనర్జీ, సీనర్జీ ద్వారా ఎన్‌డిఎ ముందుకెళ్తోందన్నారు. దేశ సేవ కోసం నా పూర్తి శక్తి సామర్థ్యాలు వినియోగిస్తానన్నారు. ఈ సేవకుడిపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారని, ప్రజల సహకారంతో ఈ దేశాన్ని ప్రగతి బాట పట్టిస్తామన్నారు. మన సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందని మోడీ ప్రశంసించారు. 1857 నాటి స్వాతంత్ర సంగ్రామం తరహాలో ఈ సారి బిజెని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజలు చేయిచేయి కలిపారన్నారు. పేదరిక నిర్మూలన, అవినీతిని అంతం చేయడం ప్రధాన లక్షంగా ఈ సారి పనిచేద్దామన్నారు.
మీడియాతో జాగ్రత్త…
పార్టీ నేతలు మీడియాతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలని సూచించారు. ఎంపిలు విఐపి సంస్కృతిని వదిలిపెట్టాలని, ఎక్కడ అవసరమైతే అక్కడ సాధారణ ప్రజల్లా వరుసలో నిలబడి తమ పనులు చేసుకోవాలని సూచించారు. మీడియాలో పేర్కొంటున్నట్టుగా మంత్రి పదవులు రావని, అలాంటి వాటిని నమ్మవద్దని, వారివారి శక్తి సామర్థాలను బట్టి మంత్రి పదవులు వరిస్తాయని మోడీ స్పష్టం చేశారు. అనంతరం మోడీ నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఎన్‌డిఎ ఎంపిలు పార్లమెంట్ నాయకుడిగా ఎన్నుకున్న తీర్మానాన్ని అందజేసి, తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని మోడీ కోరారు. ఎన్‌డిఎ పక్ష నేతలలు కూడా రాష్ట్రపతికి లేఖ అందజేశారు. ఎన్‌డిఎ పక్ష నేతగా మోడీ ఎన్నిక య్యారని రాష్ట్రపతికి ఆ లేఖలో తెలిపారు. అనంతరం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో బిజెపి ఎంపిలు(౩౦౩) సమావేశమై మోడీని బిజెపి పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోడీ వారినుద్దేశించి మాట్లాడారు. ఇదిలావుండా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన హాజరుకానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నేడు అమ్మ దగ్గరకు.. రేపు కాశీకి మోడీ
న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టే ముందు నరేంద్రమోడీ తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వ యంగా తెలిపారు. తనను రెండోసారి గెలిపించిన వారణాసి ప్రజలను కలిసేందుకు సోమవారం అక్కడకు వెళ్తున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘మా అమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు రేపు(ఆదివారం) సాయంత్రం గుజరాత్ వెళ్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన కాశీ పుణ్యభూమి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం ఉదయం వారణాసి వెళ్తాను’ అని మోదీ ట్వీట్ చేశారు.

PM Modi elected as NDA leader

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జాతీయ ఆశలు.. ప్రాంతీయ ఆకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: