దిగిపోతానన్న రాహుల్ వారించిన కాంగ్రెస్

  నిర్మాణాత్మక సారథ్యం కొనసాగించడానికి నిర్ణయం న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలలో చేదు అనుభవంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామాకు రాహుల్ గాంధీ సిద్ధపడ్డారు. తాను కేవలం సామాన్య కార్యకర్తగానే ఉంటానని, రాజీనామాకు అనుమతించాలని కోరారు. రాహుల్ రాజీనామా ప్రతిపాదనను శనివారం జరిగిన సిడబ్లుసి సమావేశంలో సభ్యులంతా తిరస్కరించారు. రాజీనామా చేయరాదని, ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నామని వర్కింగ్ కమిటీ తెలిపింది. పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళించి, పటిష్టపరిచేందుకు రాహుల్‌కు అన్ని అధికారాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. […] The post దిగిపోతానన్న రాహుల్ వారించిన కాంగ్రెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిర్మాణాత్మక సారథ్యం కొనసాగించడానికి నిర్ణయం

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలలో చేదు అనుభవంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామాకు రాహుల్ గాంధీ సిద్ధపడ్డారు. తాను కేవలం సామాన్య కార్యకర్తగానే ఉంటానని, రాజీనామాకు అనుమతించాలని కోరారు. రాహుల్ రాజీనామా ప్రతిపాదనను శనివారం జరిగిన సిడబ్లుసి సమావేశంలో సభ్యులంతా తిరస్కరించారు. రాజీనామా చేయరాదని, ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నామని వర్కింగ్ కమిటీ తెలిపింది. పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళించి, పటిష్టపరిచేందుకు రాహుల్‌కు అన్ని అధికారాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత గడ్డు కాలంలో పార్టీకి మార్గదర్శకత్వం కొనసాగించాలని, వైదొలిగే ఆలోచనకు దిగవద్దని రహుల్‌కు సభ్యులు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 543 సభ్యుల సంఖ్యాబలం ఉన్న లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి 52 స్థానాలు రావడం, చివరికి కాంగ్రెస్ ఆత్మీయ అనుబంధపు గడ్డగా ఉన్న అమేథీలో రాహుల్ ఓటమి పాలు కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటమి ఫలితాలను విశ్లేషించుకునేందుకు దేశ రాజధానిలో వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భేటీ ఆరంభంలోనే రాహుల్ తమ అధ్యక్షోపన్యాసంలో ముందుగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం,ఈ వార్త మీడియాలో ప్రచారం కావడంతో పార్టీ శ్రేణులలో కలవరం చెలరేగింది. రాజీనామాకు తాను సిద్ధపడుతున్నట్లు రాహుల్ చెప్పగానే సభ్యులు అంతా ఒక్కసారిగా తాము దీనిని తిరస్కరిస్తున్నామని, పార్టీకి నాయకత్వ బాధ్యతల నుంచి విరమించుకోవడం సముచితం కాదని పేర్కొంటూ తీర్మానం వెలువరించారు. వర్కింగ్ కమిటీ భేటీ దాదాపు నాలగు గంటల సేపు జరిగింది. ఓటమిని విశ్లేషించుకుంటూ, ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ప్రజలను ఎందుకు ప్రభావితం చేయలేకపొయ్యామనే అంశంపై దృష్టి సారించినట్లు వెల్లడైంది.
రాహుల్ మార్గదర్శకత్వం తక్షణావసరం అంతకు మించి రక్షణావసరం అని పార్టీ శ్రేణులు తెలిపాయి. పార్టీ సైద్ధాంతిక పోరులో ఓటమి చెందలేదని, ఈ క్రమానికి రాహుల్ నాయకత్వం అవసరం అని సభ్యులు స్పష్టం చేశారు. భారతీయ యువత, రైతులు, ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి తరఫున పోరుకు రాహుల్ సారథ్యం కొనసాగాల్సిందేనని, కాంగ్రెస్ పయనానికి ఆయన మార్గదర్శకత్వం అవసరం అని తీర్మానంలో తెలిపారు. సిడబ్లుసి భేటీ వివరాలను ఆ తరువాత పార్టీ ప్రతినిధులు విలేకరులకు తెలిపారు. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమం, అన్ని స్థాయిల్లో పార్టీ విస్తారితానికి తీసుకోవల్సిన చర్యల గురించి త్వరలోనే వెల్లడించడం జరగుతుందని పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ వివరించారు. ఈ ఎన్నికల ఫలితాలు మరీదారుణం అనుకోవడం లేదని, అయితే అంచనాలను అందుకోవడంలో పార్టీ విఫలం అయిందని మొయిలీ అంగీకరించారు. పార్టీ ఓటమికి సమిష్టి లోపం ఉందని స్పష్టం చేశారు. తాను అనుకున్న దానికి, ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం రాహుల్‌ను కలవరపర్చింది. ఇక అమేథీలో ఓటమితో రాజీనామాకు సిద్ధపడే రాహుల్ సిడబ్లుసి భేటీకి వచ్చినట్లు వెల్లడైంది. అయితే సీనియర్ నేతలు ఆయన రాజీనామా చేయకుండా బుజ్జగించినట్లు , ఈ క్రమంలో సోనియా, మన్మోహన్‌లు మౌనంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

CWC Rejects rahul gandhi’s resignation

The post దిగిపోతానన్న రాహుల్ వారించిన కాంగ్రెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: