ఇచ్చి పుచ్చుకుందాం

  ఇరుగు పొరుగులతో ఇచ్చిపుచ్చుకుంటాం లివ్ అండ్ లెట్ లివ్ విధానం మాది గతంలో నేనే చొరవ తీసుకుని మహారాష్ట్ర సిఎంను కలిశా ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నాం ఆంధ్రప్రదేశ్‌తో కూడా అవే సంబంధాలు కొనసాగిస్తాం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోదావరి నది నుంచి ఏటా 3,500 టిఎంసిలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్ఠంగా 700-800 టిఎంసిలు వాడుకోగలదు. మిగతాది ఆంధ్రప్రదేశ్ వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే […] The post ఇచ్చి పుచ్చుకుందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇరుగు పొరుగులతో ఇచ్చిపుచ్చుకుంటాం
లివ్ అండ్ లెట్ లివ్ విధానం మాది
గతంలో నేనే చొరవ తీసుకుని మహారాష్ట్ర సిఎంను కలిశా
ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నాం
ఆంధ్రప్రదేశ్‌తో కూడా అవే సంబంధాలు కొనసాగిస్తాం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

గోదావరి నది నుంచి ఏటా 3,500 టిఎంసిలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్ఠంగా 700-800 టిఎంసిలు వాడుకోగలదు. మిగతాది ఆంధ్రప్రదేశ్ వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రైతులకు గోదావరి నుంచి నీరు ఇవ్వవచ్చు.- ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సిఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సిఎం కెసిఆర్ స్నేహహస్తం అందించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నామని ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించారు. తాను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశానని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై తానే చొరవ తీసుకుని మాట్లాడానని పేర్కొన్నారు. “లివ్ అండ్ లెట్ లివ్‌” తమ విధానమని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పానని, దాంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చిందని అన్నారు. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దామని అని జగన్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టిఎంసిలు సముద్రంలో కలుస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదని తెలిపారు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుందన్నారు. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చని, దాంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని వివరించారు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చని చెప్పారు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు అని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.

YS Jagan meet CM KCR at Pragathi Bhavan

The post ఇచ్చి పుచ్చుకుందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: