ఎసిబికి చిక్కిన మంచిర్యాల ఆర్‌డిఒ కార్యాలయ అధికారి…

  లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు బిల్లుల చెల్లింపు కోసం రూ.50 వేలు డిమాండ్ వేధింపులు భరించలేక ఎసిబిని ఆశ్రయించిన బాధితుడు పోలీసుల అదుపులో పాలనాధికారి, రికార్డులు స్వాధీనం మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ అదికారి కార్యాలయంలో పరిపాలన అధికారిగా పని చేస్తున్న మనోహర్‌రావు శనివారం ఏసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. బిల్లుల చెల్లింపు వ్యవహారంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా కార్యాలయం ఆవరణలోనే ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మంచిర్యాలకు చెందిన బాధితుడు […] The post ఎసిబికి చిక్కిన మంచిర్యాల ఆర్‌డిఒ కార్యాలయ అధికారి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

బిల్లుల చెల్లింపు కోసం రూ.50 వేలు డిమాండ్
వేధింపులు భరించలేక ఎసిబిని ఆశ్రయించిన బాధితుడు
పోలీసుల అదుపులో పాలనాధికారి, రికార్డులు స్వాధీనం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ అదికారి కార్యాలయంలో పరిపాలన అధికారిగా పని చేస్తున్న మనోహర్‌రావు శనివారం ఏసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. బిల్లుల చెల్లింపు వ్యవహారంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా కార్యాలయం ఆవరణలోనే ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మంచిర్యాలకు చెందిన బాధితుడు అప్పాసు రాము గత శాసన సభ ఎన్నికల్లో వీడియో కవరేజీ చేసిన రూ. 2 లక్షల డబ్బుల కోసం పరిపాలన అధికారి మనోహర్‌రావు వద్దకు గత ఆరు నెలలుగా తిరుగుతున్నప్పటికీ పర్సెంటేజీ ఇవ్వనిదే బిల్లులు చెల్లించమని పలు మార్లు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ వేధింపులకు గురి చేయగా బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు.

శనివారం కార్యాలయం ఆవరణలోనే రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో కరీంనగర్ ఏసిబి డిఎస్‌పి భద్రయ్య, ఆదిలాబాద్ సిఐ రవీందర్, కరీంనగర్ సిఐ వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిబి డిఎస్‌పి విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌డిఓ కార్యాలయంలో ఏఓగా పని చేస్తున్న మనోహర్‌రావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బాధితుడు అందజేసిన రూ.50 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏఓ మనోహర్‌రావును అదుపులోకి తీసుకొని రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు.ప్రభుత్వ అధికారులు ఎవరైన లంచం అడిగినట్లయితే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఆది నుంచి వివాదాస్పదుడే ….

ఆర్‌డిఓ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పని చేస్తున్న మనోహర్‌రావు ఆదినుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2017లో జన్నారం తహసీల్దార్‌గా పని చేస్తున్న సమయంలో విఆర్‌ఓలను డబ్బుల కోసం వేధింపులకు గురి చేయగా పలువురు మండల విఆర్‌ఓలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా స్థానిక ఆర్‌డిఓ కార్యాలయంలో కూడా పరిపాలన అధికారిగా పని చేస్తూ ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేసే వారనే ఆరోపణలు ఉన్నాయి.

Revenue Division Officer Arrested

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎసిబికి చిక్కిన మంచిర్యాల ఆర్‌డిఒ కార్యాలయ అధికారి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: