ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల…

  అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశం టిఎస్‌ఎల్ పిఆర్‌బి చైర్మన్ వివి శ్రీనివాసరావు హైదరాబాద్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్, డ్రైవర్, మెకానిక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేశారు. పోలీసు రిక్రూట్ మెంట్‌లో వివిధ పోస్టులకు నిర్వహించిన తుది పరీక్షలు రాసిన అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశం కల్పించినట్లు టిఎస్‌ఎల్ పిఆర్‌బి చైర్మన్ వివి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఈక్రమంలో పోలీస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈ ఏడాది ఎప్రిల్ […] The post ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశం

టిఎస్‌ఎల్ పిఆర్‌బి చైర్మన్ వివి శ్రీనివాసరావు

హైదరాబాద్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్, డ్రైవర్, మెకానిక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేశారు. పోలీసు రిక్రూట్ మెంట్‌లో వివిధ పోస్టులకు నిర్వహించిన తుది పరీక్షలు రాసిన అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశం కల్పించినట్లు టిఎస్‌ఎల్ పిఆర్‌బి చైర్మన్ వివి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకనటలో తెలిపారు.

ఈక్రమంలో పోలీస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈ ఏడాది ఎప్రిల్ 20, 21న జరిటిన ఎస్‌సిటి పోస్టులకు 50,861మంది అభ్యర్థులకు గాను 36,829మంది అర్హత సాధించిగా 72.41 శాతం ఉత్తీర్ణులయ్యారని, అలాగే ఏప్రిల్ 20,27వ తేదీల్లో ఎస్‌పిటి ఎస్‌ఐ,ఐటి అండ్ సి పరీక్షలు నిర్వహించగా 1,681మంద అభ్యర్థులు హాజరుకాగా అందులో 1,315మంది అర్హత సాధించారని, 85.70శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఇదే తేదీల్లో ఎస్‌సిటి ఎఎస్‌ఐఎఫ్‌పిబి అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలకు 1.091మంది హాజరుకాగా అందులో 935మంది అర్హత సాధించారని, 85.70శాతం ఉత్తీర్ణులయ్యారు. కాగా అభ్యర్థుల తుది పరీక్షలలో ప్రశ్నలు, జవాబులు తప్పొప్పులపై వెరిఫికేషన్, రీ వెరిఫకేషన్ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలలో ఎలాంటి అనుమాలుంటే సదరు అభ్యర్థులు తమ జవాబు పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం (ఒక్కో పేపర్)కు ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు రూ. 2000వేలు, ఇతరులు రూ.3000వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 28 ఉదయం 8గంటల నుంచి ఈనెల 30వరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

SI, Constable Results Released

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: