ఇక ‘మిషన్ రాజ్యసభ’

  2020 నవంబర్‌కల్లా పెద్దల సభలో పూర్తి మెజారిటీ? అంచనా వేస్తున్న ఎన్‌డిఏ మెజారిటీలేక బిల్లులకు ప్రతిబంధకాలు గత ఐదేళ్లలో ప్రతిపాదనకు సైతం రాని బిల్లులు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతాపార్టీ, దాని సారథ్యంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ ఇక ఇప్పుడు ‘మిషన్ రాజ్యసభ’ను చేపట్టాల్సి ఉంది. ఎగువసభలో మైనారిటీలో ఉన్న బిజెపి, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని కీలకమైన బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందేందుకు గత ప్రభుత్వం కొంత […] The post ఇక ‘మిషన్ రాజ్యసభ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2020 నవంబర్‌కల్లా పెద్దల సభలో పూర్తి మెజారిటీ?
అంచనా వేస్తున్న ఎన్‌డిఏ
మెజారిటీలేక బిల్లులకు ప్రతిబంధకాలు
గత ఐదేళ్లలో ప్రతిపాదనకు సైతం రాని బిల్లులు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతాపార్టీ, దాని సారథ్యంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ ఇక ఇప్పుడు ‘మిషన్ రాజ్యసభ’ను చేపట్టాల్సి ఉంది. ఎగువసభలో మైనారిటీలో ఉన్న బిజెపి, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని కీలకమైన బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందేందుకు గత ప్రభుత్వం కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎన్‌డిఏకు మెజారిటీ ఉంటే ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులు రాజ్యసభలో సులభంగానే ఆమోదం పొందుతాయి. ఇప్పటివరకు పెద్దల సభలో ఎన్‌డిఏకు తగిన సంఖ్యలో సభ్యులు లేనందువల్ల ట్రిపుల్ తలాక్, మోటారు వాహనాల చట్టం, పౌరసత్వ చట్టానికి సవరణలు వంటి కీలకమైన బిల్లులు సభ ఆమోదం పొందలేకపోయాయి. లోక్‌సభ సభ్యుల్ని ప్రజలే ఎన్నుకుంటారు కానీ రాజ్యసభ సభ్యుల్ని ఎంఎల్‌ఏలు ఎంపిక చేస్తారు. ఒక పార్టీకి ఎంత ఎక్కువ మంది శాసనసభ్యులుంటే అంత ఎక్కువ సంఖ్యలో రాజ్యసభకు ఎంపీలను పంపే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీల కాలపరిమితి ఆరేళ్లయితే, లోక్‌సభ ఎంపీల టెరం ఐదేళ్లు. అయితే రాజ్యసభ సభ్యులందరికీ ఒకేసారి కాలపరిమితి ముగియదు.

ఉందిలే మంచికాలం
గత ఏడాది రాజ్యసభ సంఖ్యాబలంలో ఎన్‌డిఏ కాంగ్రెస్‌ను అధిగమించింది. రాజ్యసభ చరిత్రలో ఇది మొదటిసారి. 245 మంది సభ్యులున్న పెద్దల సభలో ఎన్‌డిఏకు 101 మంది సభ్యులున్నారు. అంతేకాక ముగ్గు రు నామినేటెడ్ సభ్యులు స్వపన్‌దాస్ గుప్తా, కోం, నరేంద్ర జాధవ్… మరో ముగ్గురు స్వతంత్ర సభ్యులు కూడా ఎన్‌డిఏకు మద్దతిచ్చారు. దాంతో ఎన్‌డిఏ బలం 107కు పెరిగింది. యుపిఎ నామినేట్ చేసిన కెటిఎస్ తులసి వచ్చే ఏడాది ప్రారంభంలో రిటైరవుతారు కనుక, ఎన్‌డిఏ తన మనిషిని నియమించుకునే అవకాశం ఉంటుంది. 2020 నవంబర్ నాటికి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి 14 రాష్టాల నుంచి వచ్చే 19 మంది సభ్యుల మద్దతు మద్దతు లభిస్తుంది కనుక ఎన్‌డిఎ సభ్యుల సంఖ్య హాఫ్‌వే మార్క్ 123 దాటి 125కు చేరుకుంటుంది. దాంతో దాదాపు 15 ఏళ్ల కాలంలో రాజ్యసభలో మెజారిటీ సాధించే మొదటి ప్రభుత్వ మవుతుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 మంది శాసనసభ్యులు ఉన్నారు కనుక వీటిలో చాలా స్థానాలు ఆ రాష్ట్రం నుంచే భర్తీ అవుతాయి. వాటికి తోడు తమిళనాడులో నూతన మిత్రపక్షం అన్నా డిఎంకె నుంచి ఆరు, రాజస్థాన్ నుంచి మూడు, బహుశ ఒడిశాలో బిజెడి నుంచి ఒకటి కూడా అదనంగా చేరవచ్చు. అలాగే కర్ణాటక, మిజోరాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కో స్థానం పొందగలుగుతుంది.

అయితే రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కొన్ని స్థానాలు కోల్పోవచ్చు. ఈ ఏడాది ఉత్తరార్ధంలో మహారాష్ట్ర, హర్యాన, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2020 నవంబర్ నాటికి రాజ్యసభలో ఎన్‌డిఏ బలం పెరగవచ్చు. ఈ రాష్ట్రాల నుంచి దాదాపు నాలుగు రాజ్యసభ స్థానాలు రావచ్చు. ఏతావాతా ఇప్పటికి, 2020 నవంబర్ నాటికీ మధ్య రాజ్యసభకు 75 స్థానాలకు ఎంపిక జరగాల్సి ఉంటుంది.

పెద్దల సభలో సర్కార్‌కు చుక్కెదురు
రాజ్యసభలో మెజారిటీ లేక గత ఐదేళ్లలో ఎన్‌డిఏ కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎన్‌డిఏతర పక్షాలన్నీ ఏకమై బిల్లును వ్యతిరేకించాలనుకోవడంతో భూసేకరణ చట్టానికి సవరణల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయారు. ట్రిపుల్ తలాక్ నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. కనీసం దానిపై చర్చకు కూడా ప్రతిపక్షం అంగీకరించలేదు. మరికొన్ని బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. రాజ్యసభలో కూడా మెజారిటీ సాధిస్తే బిల్లుల ఆమోదం దానికి నల్లేరు మీద బండి నడకే అవుతుంది.

NDA set for Rajya Sabha majority next year

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇక ‘మిషన్ రాజ్యసభ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: