దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ప్రమాణం

  జోహాన్సెస్‌బర్గ్ : ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్‌సి) అధినేత సిరిల్ రామఫోసా శనివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఆ పదవిలో అయిదేళ్లు ఉంటారు. ఈ నెలలో ఆరోసారి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 66 ఏళ్ల రామఫోసా రాజధానిలోని లోఫ్టస్ వెర్స్‌ఫీల్డ్ స్టేడియంలో వేలాదిమంది ప్రముఖులు, అధికారులు, పౌరుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. వివిధ దేశాధినేతలు, మాజీ దేశాధినేతలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమాఖ్యల అధిపతులు ఈ […] The post దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ప్రమాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జోహాన్సెస్‌బర్గ్ : ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్‌సి) అధినేత సిరిల్ రామఫోసా శనివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఆ పదవిలో అయిదేళ్లు ఉంటారు. ఈ నెలలో ఆరోసారి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 66 ఏళ్ల రామఫోసా రాజధానిలోని లోఫ్టస్ వెర్స్‌ఫీల్డ్ స్టేడియంలో వేలాదిమంది ప్రముఖులు, అధికారులు, పౌరుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. వివిధ దేశాధినేతలు, మాజీ దేశాధినేతలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమాఖ్యల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో జరిగే దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదటిసారి ప్రజల సమక్షంలో జరగడం విశేషం. ఈ వారం ప్రారంభంలో ప్రధాన న్యాయమూర్తి మొగోయంగ్ మొగోయంగ్ పర్యవేక్షణలో నేషనల్ అసెంబ్లీ రామఫోసాను దేశాధినేతగా ఎన్నుకుంది.

Ramaphosa takes oath as South Africa president

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ప్రమాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: