రాష్ట్రపతి చేతికి కొత్త ఎంపీల జాబితా

  17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం న్యూఢిల్లీ: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం (ఇసి) శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు సమర్పించింది. దీంతో 17వ లోక్‌సభ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో సహా పూర్తి స్థాయి ఎన్నికల సంఘం రాష్ట్రపతిని కలుసుకొని లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సమర్పించిందని రాష్ట్రపతి భవన్ […] The post రాష్ట్రపతి చేతికి కొత్త ఎంపీల జాబితా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం (ఇసి) శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు సమర్పించింది. దీంతో 17వ లోక్‌సభ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో సహా పూర్తి స్థాయి ఎన్నికల సంఘం రాష్ట్రపతిని కలుసుకొని లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సమర్పించిందని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. రాష్ట్రపతికి ఈ జాబితాను ఇవ్వడంతో అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల నిర్వహణను విజయవంతంగా పూర్తి చేసిందుకు రాష్ట్రపతి ఎన్నికల ప్రధానాధికారిని, ఇతర ఎన్నికల కమిషనర్లను అభినందించారు. శనివారంనాడు అంతకు ముందు కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి కోవింద్ 16వ లోక్‌సభను రద్దు చేశారు.

list of newly-elected MPs to President for constitution of 17th Lok Sabha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాష్ట్రపతి చేతికి కొత్త ఎంపీల జాబితా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: