పాఠ్యపుస్తకాలు రెడీ…

  జిల్లా కేంద్రాలకు చేరుకున్న 90శాతం ఉచిత పాఠ్యపుస్తకాలు సెలవులు ముగిసే నాటికి పూర్తిగా స్కూళ్లకు హైదరాబాద్ : 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి న ఉచిత పాఠ్యపుస్తకాలు 99.03 శాతం జిల్లా కేంద్రాలు చేరుకున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి 1,45,59, 487 ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, శనివారం నాటికి 1,44,18, 797 జిల్లా కేంద్రాలకు చేరినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలలు పునఃప్రారంభం కానున్న […] The post పాఠ్యపుస్తకాలు రెడీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జిల్లా కేంద్రాలకు చేరుకున్న 90శాతం ఉచిత పాఠ్యపుస్తకాలు
సెలవులు ముగిసే నాటికి పూర్తిగా స్కూళ్లకు

హైదరాబాద్ : 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి న ఉచిత పాఠ్యపుస్తకాలు 99.03 శాతం జిల్లా కేంద్రాలు చేరుకున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి 1,45,59, 487 ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, శనివారం నాటికి 1,44,18, 797 జిల్లా కేంద్రాలకు చేరినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పట్లోగానే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు చేరనున్నాయి. ఎన్ని పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయనే దానిపై జిల్లాల విద్యాశాఖాధికారులు పాఠశాలలవారీగా వివరాలను విద్యాశాఖకు పం పించారు. దీని ఆధారంగా పాఠ్య పుస్తకాలు జిల్లాలకు చేరుతున్నాయి. అలాగే సేల్ పుస్తకాలను జిల్లాల్లో డిఇఒ గుర్తించిన బుక్ షాపుల్లో మే 10 నుంచే అందుబాటులో ఉంచారు. వచ్చే విద్యాసంవత్సరానికి అవసరమైతే 1.19 సేల్ పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచామని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు జిల్లాల్లో ఆయా బుక్ షాపుల నుంచి ఎంఆర్‌పి ధరకు కొనుగోలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

స్కూళ్లు తెరవగానే పుస్తకాల పంపిణీ

విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల కోసం ఇబ్బందిపడకుండా.. పాత పుస్తకాలతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు పాఠశాలలు తెరిచే రోజు విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉంచేందుకు ముందుగానే ముద్రణ ప్రారంభించి.. వాటిని జిల్లాలకు చేరవేసే చర్యలు చేపట్టింది. 2019-20 విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయనున్నారు.

జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రతి ఏడాది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. దీంతో చదువు అభ్యసించడం కష్టంగా మారుతోంది. కొందరు నిరుపేద విద్యార్థులు ప్రైవేట్‌గా పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి చదువుకోవాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు అందే సరికి సగం విద్యా సంవత్సరం ముగుస్తుండడం, అవసరమైన వాటిలో సగం పుస్తకాలు మాత్రమే అందుతుండడం వంటి చర్యలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వం విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పుస్తకాలు విద్యార్థులకు చేరాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
అందుబాటులో తెలుగు తప్పనిసరి పుస్తకాలు

తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలన్న చట్టం నేపథ్యంలో మార్కెట్‌లో తెలుగు తప్పనిసరి పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రతి ఏటా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ ఒక్కో తరగతి పెరుగుతూ వస్తోంది. గత విద్యాసంవత్సరం 1,6 తరగతులకు పుస్తకాలను రూపొందించగా, ఈ సారి 2,7 తరగతులను పాఠ్యపుస్తకాలను ముద్రించారు. 1,2,6,7 తరగతులకు సంబంధించిన తెలుగు సేల్ పుస్తకాలు ఈ నెల 10 నుంచి జిల్లాల్లో డిఇఒ గుర్తించిన బుక్ షాపులలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలతోపాటు, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్ కలిగిన పాఠశాలలు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. తెలుగు మీడియంతో పాటు ఇతర మీడియంలకు చెందిన విద్యార్థులు కూడా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలన్న చట్టం నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం గత విద్యాసంవత్సరం నుంచి అమలవుతోంది.

Free TextBooks are Ready for Distribution

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాఠ్యపుస్తకాలు రెడీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: