గ్యాంగ్‌స్టర్ ‘రణరంగం’

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రణరంగం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా తొలి ప్రచార చిత్రాలను విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990, 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “భిన్నమైన భావోద్వేగాలు, […] The post గ్యాంగ్‌స్టర్ ‘రణరంగం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రణరంగం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా తొలి ప్రచార చిత్రాలను విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990, 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలవుతుంది”అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి.

Sharwanand Ranarangam movie first look release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్యాంగ్‌స్టర్ ‘రణరంగం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: