దిగిపోతానన్నా.. పార్టీ వద్దంది

రాష్ట్రంలో మోడీ ఎమర్జెన్సీ పరిస్థితిని తెచ్చారు : బెంగాల్ సిఎం మమత న్యూఢిల్లీ : తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం అయ్యానని, అయితే పార్టీ వర్గాలు అడ్డుకున్నాయని బెంగాల్ సిఎం మమత బెనర్జీ తెలిపారు. తృణమూల్ నేతలతో అంతర్గత భేటీ తరువాత మమత శనివారం విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత వైఫల్యానికి బాధ్యత తీసుకుంటూ తాను పదవి నుంచి తప్పుకోవాలని అనుకున్నానని తెలిపారు. ఇప్పటి ఎన్నికలలో మోడీ, అమిత్ షాలకు మమత సవాళ్లు […] The post దిగిపోతానన్నా.. పార్టీ వద్దంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
రాష్ట్రంలో మోడీ ఎమర్జెన్సీ పరిస్థితిని తెచ్చారు : బెంగాల్ సిఎం మమత

న్యూఢిల్లీ : తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం అయ్యానని, అయితే పార్టీ వర్గాలు అడ్డుకున్నాయని బెంగాల్ సిఎం మమత బెనర్జీ తెలిపారు. తృణమూల్ నేతలతో అంతర్గత భేటీ తరువాత మమత శనివారం విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత వైఫల్యానికి బాధ్యత తీసుకుంటూ తాను పదవి నుంచి తప్పుకోవాలని అనుకున్నానని తెలిపారు. ఇప్పటి ఎన్నికలలో మోడీ, అమిత్ షాలకు మమత సవాళ్లు విసిరారు. బెంగాల్‌లో బిజెపి బలం సంతరించుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే ఈసారి అధికార టిఎంసికి కేవలం 22 స్థానాలు వచ్చాయి. బిజెపి రాష్ట్రంలో వేళ్లను విస్తరించుకుంటున్నట్లుగా 18 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపికి అడ్డుకట్ట లేకపోయినట్లు మమత పరోక్షంగా అంగీకరించారు.

రాష్ట్రంలో తమ పార్టీపై, ప్రభుత్వంపై మోడీ ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరించిందని, మొత్తం మీద ఎన్నికల ప్రచార దశలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని తీసుకువచ్చిందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా ఒక పద్దతి ప్రకారం వ్యూహాత్మకంగా జరిగిందని, కేంద్రీయ బలగాలను అత్యధిక సంఖ్యలో రంగంలోకి దింపారని, వారు తమ పార్టీ కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను భయభ్రాంతులను చేయడం జరిగిందని , తాము ఎన్నిసార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. ఏదో జరిగిపోతున్నదనే వాతావరణాన్ని కల్పించారని, బిజెపి నేతలు ప్రచార సభలు పెట్టి, హిందూ ముస్లిం మధ్య చిచ్చు రగిల్చివెళ్లారని, ఈ విధంగా ఓట్లు చీలిపొయ్యేలా చేశారని, దీనితోనే పార్టీకి నష్టం జరిగిందని మమత తెలిపారు. వైఫల్యానికి బాధ్యత తీసకుంటూ ఓ వైపు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ రాజీనామాకు సిద్ధపడ్డ తరుణంలోనే మమత తమ రాజీనామా ప్రతిపాదన గురించి వెల్లడించారు.

Mamata offers to quit as West Bengal CM but TMC rejects

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దిగిపోతానన్నా.. పార్టీ వద్దంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: