దిగ్భ్రాంతికర ఫలితాలు!

మోడీ ప్రభుత్వం భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దేశ స్వాతంత్య్రం తర్వాత ఒక కాంగ్రేసేతర పార్టీకి ఇంత భారీ మెజారిటీ లభించడం ఇదే ప్రథమం. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ 300పై చిలుకు స్థానాలు గెలుచుకుంది. ఇది అంత ఆశ్చర్యకరమైన వార్త కాదు. కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోవడం, భోపాల్‌లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గెలవడం ఇలాంటి సంఘటనల్లో ముఖ్యంగా ప్రస్తావించవలసినవి. అన్నింటికన్నా పెద్ద షాక్ అమేథీలో రాహుల్ […] The post దిగ్భ్రాంతికర ఫలితాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మోడీ ప్రభుత్వం భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దేశ స్వాతంత్య్రం తర్వాత ఒక కాంగ్రేసేతర పార్టీకి ఇంత భారీ మెజారిటీ లభించడం ఇదే ప్రథమం. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ 300పై చిలుకు స్థానాలు గెలుచుకుంది. ఇది అంత ఆశ్చర్యకరమైన వార్త కాదు. కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోవడం, భోపాల్‌లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గెలవడం ఇలాంటి సంఘటనల్లో ముఖ్యంగా ప్రస్తావించవలసినవి. అన్నింటికన్నా పెద్ద షాక్ అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోవడం. అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట వంటి నియోజకవర్గం. ఇంతకు ముందు కేవలం రెండు సార్లు మాత్రమే అమేథీలో కాంగ్రెస్ ఓడిపోయింది. 1977కు ముందు ఒకసారి కాంగ్రెస్ ఓడిపోయింది. 1998లో ఒకసారి కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు మూడోసారి ఓడిపోయింది. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి అమేథీలో కాంగ్రెస్ ఓటమి దిగ్భ్రాంతికరమైనది. ఎందుకంటే అమేథీలో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితులేవీ కనిపించలేదు. పైగా స్మృతి ఇరానీ ఇక్కడ పెద్ద జనాదరణ ఉన్న నాయకురాలేమీ కాదు. అయినా బిజెపి నుంచి స్మృతి ఇరానీ గెలవడం అనూహ్యమైన పరిణామం. బహుశా ఈ పరిణామాన్ని రాహుల్ ముందే ఊహించాడా? అందుకే వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారా?

ఈ ఎన్నికల్లో మరో షాక్, ఉత్తరప్రదేశ్ మహాకూటమి ఏమాత్రం ప్రభావం చూపకపోవడం. నిజానికి సామాజిక న్యాయం ప్రాతిపదికన ఏర్పడిన ప్రాంతీయ పార్టీలివి. వెనుకబడిన వర్గాల కోసం, దళిత సముదాయం కోసం పని చేస్తున్న పార్టీలు మహాకూటమిగా ఒక్కటయ్యాయి. అలాంటి పార్టీలే ప్రాముఖ్యం లేని స్థితికి చేరుకున్నాయంటే భారత రాజకీయాలు ఏ దశలోకి ప్రవేశించాయో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో సమాజవాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉండేది. ఈ రెండు పార్టీలు ఈ వైరాన్ని మరిచి పొత్తు పెట్టుకున్నాయి. అయినా ఈ రెండు పార్టీలు బిజెపిని ఓడించలేకపోయాయి. ఇది అనూహ్యమైన పరిణామం.

ఈ ఎన్నికల్లో మూడో షాక్. భోపాల్‌లో ప్రజ్ఞా ఠాకూర్ గెలుపు. సంఝోతా ఎక్స్‌ప్రెస్ బాంబుపేలుళ్ళ కేసులో ఆమె నిందితురాలు. ఆమెపై టెర్రరిస్టు కేసు విచారణ జరుగుతోంది. అలాంటి ఆమెకు టిక్కెట్ ఇవ్వడంపై చాలా మంది విమర్శలు సంధించారు. టిక్కెట్టు లభించిన తర్వాత భోపాల్ అభ్యర్ధిగా ఆమె మాట్లాడుతూ ఉగ్రవాదులతో పోరాడుతూ హతమైన అమరవీరుడు, అశోక్‌చక్ర గ్రహీత హేమంత్ కర్కరేను తాను శపించానని చెప్పింది. తన శాపం వల్లనే హేమంత్ కర్కరే చనిపోయాడని కూడా చెప్పింది. అంతటితో ఆమె ఆగలేదు. మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని పొగిడింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు, గాంధీజీని అవమానించడం వంటివి ఎన్ని చేసినప్పటికీ ఆమెయే చివరకు గెలిచింది. భోపాల్‌లో కాంగ్రెస్ అగ్రనాయకుడు దిగ్విజయ్ సింగ్ ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో నాల్గవ షాక్ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు పాలించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా పతనమైపోయింది. 2014లో ఆంధ్రప్రదేశ్ చీలిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఒక్క నాలుగేళ్ళ కాలంలో ఘోరంగా ఓడిపోయారు. చంద్రబాబుపై ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం ఉండవచ్చని, ఆయన ఓడిపోవచ్చని చాలా మంది మొదట అంచనా వేశారన్నది నిజమే, కాని తెలుగుదేశం ఇలా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఎవరు అనుకోలేదు. ఎన్నికల్లో ఐదవ షాక్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలో ఒక్క సీటు కూడా లభించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా బలమైన నేత, ప్రజాదరణ ఉన్న ఆతిషి మర్లీనా కూడా ఓడిపోయారు. ఢిల్లీలో విద్యాపరమైన అనేక సంస్కరణలు, అభివృద్ధి చర్యలు చేపట్టిన నాయకురాలు ఆమె. ఆమెను ఓడించి ఢిల్లీ ప్రజలు ప్రజాసేవలో ఎన్నడూ కనబడని మాజీ క్రికెటర్, బిజెపి అభ్యర్థి గౌతం గంభీర్ ను గెలిపించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదరకుండా అడ్డుపడిన షీలా దీక్షిత్ కూడా ఈ సారి ఘోరంగా ఓడిపోయారు.

కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ (యస్) కూటమి పూర్తిగా విఫలమైంది. 2014 బిజెపి కర్ణాటకలో సాధించిన విజయం కన్నా భారీ విజయం ఈ సారి సాధించింది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ్ కూడా తుంకూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అన్నింటికన్నా పెద్ద షాక్.. ఈ సారి బిజెపి పశ్చిమబెంగాల్లో అడుగుపెట్టడమే కాదు, చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. 2014లో కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచిన బిజెపి ఈ సారి పశ్చిమబెంగాల్లో రెండంకెలకు చేరుకుంది. మమతాబెనర్జీతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకుంది. బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు పూర్తిగా అంతరించడంతో ఈ కేడర్ మొత్తం బిజెపి వైపు మళ్ళినట్లు కనిపిస్తోంది. తమిళనాడులో డిఎంకె మళ్ళీ తలెత్తింది. 2014లో డిఎంకెకు ఒక్క స్థానం లభించలేదు. ఈ సారి ఎన్నికల్లో డిఎంకె, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ కూటమి తమిళనాడులో ఘనవిజయం నమోదు చేసింది. కరుణానిధి లేకుండా డిఎంకె ఎన్నికలకు వెళ్ళడం ఇదే మొదటిసారి. స్టాలిన్ తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నట్లే. గత దశాబ్దకాలంగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న జయలలిత పార్టీ, అన్నాడిఎంకె ఇప్పుడు పూర్తిగా మట్టికరిచింది.

జమ్ము కశ్మీరులో ప్రజాదరణ ఉన్న నాయకురాలు మహబూబా ముఫ్తీ. అనంతనాగ్ నియోజకవర్గంలో ఆమె ఓడిపోవడం మరో నమ్మరాని వార్త. ఆమె ఓడిపోవడం మాత్రమే కాదు, కనీసం సమీప ప్రత్యర్థి హోదాలో కూడా లేరు. మూడవ అభ్యర్థిగా నిలిచారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన పరిణామం ఐదు నెలల క్రితం కాంగ్రెస్ ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు పరాజయం పాలవ్వడం. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ పై విమర్శలు, ఫిర్యాదుల మధ్య ముగిసిన ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం నమోదు చేసిందన్నది వాస్తవం.

Modi and BJP Make History in India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దిగ్భ్రాంతికర ఫలితాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: