పాల ధర పెంచిన మదర్ డెయిరీ

  న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ డెయిరీలలో ఒకటైన మదర్ డెయిరీ పాల ధరలను లీటరుకు రూ.2 మేర పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 25నుంచి అమలులోకి రానున్నాయి. లీటరుకు 2 రూపాయలు, అరలీటరుకు రూ.1 చొప్పున ధరలు పెరగనున్నాయి.పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలను పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. పాల సేకరణ ధరలు గత మూడు, నాలుగు నెలలుగా నిరంతరాయంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా పశుగ్రాసం వ్యయం 20 శాతానికి పైగా పెరగడం, లేబర్‌కాస్ట్ పెరగడం వంటి […] The post పాల ధర పెంచిన మదర్ డెయిరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ డెయిరీలలో ఒకటైన మదర్ డెయిరీ పాల ధరలను లీటరుకు రూ.2 మేర పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 25నుంచి అమలులోకి రానున్నాయి. లీటరుకు 2 రూపాయలు, అరలీటరుకు రూ.1 చొప్పున ధరలు పెరగనున్నాయి.పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలను పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. పాల సేకరణ ధరలు గత మూడు, నాలుగు నెలలుగా నిరంతరాయంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా పశుగ్రాసం వ్యయం 20 శాతానికి పైగా పెరగడం, లేబర్‌కాస్ట్ పెరగడం వంటి కారణంతో పాల ధరలను పెంచాల్సి వచ్చిందని మదర్ డెయిరీ ఒక ప్రకటనలో తెలిపింది.అయితే టోకెన్ మిల్క్ లేదా బల్క్ వెండర్ మిల్క్ ధరలను మాత్రం పెంచడం లేదు.

కేవలం పాలీ ప్యాక్ వేరియంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కొత్త రేటు ప్రకారం వెన్న శాతం అధికంగా ఉండే పాల ధర లీటరు రూ.53గాను, అరలీటరు రూ.27 గాను ఉంటుంది. పూర్తిస్థాయి క్రీమ్ (ప్రీమియం) పాలు లీటరుకు రూ.55గాను, అరలీటరు రూ.28గాను ఉంటుంది. టోన్డ్ మిల్క్ (లైవ్ లైట్) ధర లీటరుకు రూ.34నుంచి రూ.36కు పెరిగింది. అరలీటరు ధర రూ.18నుంచి రూ.19కి పెరిగింది. స్కిమ్డ్ అరలీటరు పాల ధరను కూడా ఒక రూపాయి పెంచింది.అయితే అరలీటరు ఆవు పాల ధరను రూపాయి పెంచింది కానీ లీటరు ధరలో మార్పు లేదు. కాగా ఇప్పటికే అమూల్ కూడా తన పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం లీటరుకు రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Mother Dairy hikes milk prices by Rs 2 per litre

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాల ధర పెంచిన మదర్ డెయిరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: