ముంబయి ఎయిర్‌పోర్టులో నరేష్ గోయల్ దంపతుల నిలిపివేత

  లండన్ వెళుతుండగా కస్టడీలోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు ముంబయి: జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్యను శనివారం ముంబయి విమానాశ్రయంలో ఆపేశారు. వీరు ముంబయినుంచి వెళ్ల బోతుండగా ఇమిగ్రేషన్ అధికారులు వారిని ఆపేశారు. ‘నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్‌లు ఇకె407 విమానంలో లండన్ వెళ్తుండగా వారిని దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నారు. విమానం అప్పటికే టాక్సీవే చేరుకోగా, దాన్ని వెనక్కి రప్పించి ఇమిగ్రేషన్ అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు’ […] The post ముంబయి ఎయిర్‌పోర్టులో నరేష్ గోయల్ దంపతుల నిలిపివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్ వెళుతుండగా కస్టడీలోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు

ముంబయి: జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్యను శనివారం ముంబయి విమానాశ్రయంలో ఆపేశారు. వీరు ముంబయినుంచి వెళ్ల బోతుండగా ఇమిగ్రేషన్ అధికారులు వారిని ఆపేశారు. ‘నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్‌లు ఇకె407 విమానంలో లండన్ వెళ్తుండగా వారిని దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నారు. విమానం అప్పటికే టాక్సీవే చేరుకోగా, దాన్ని వెనక్కి రప్పించి ఇమిగ్రేషన్ అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు’ అని ముంబయి విమానాశ్రయం అథారిటీకి చెందిన ఇమిగ్రేషన్ అధికారి ఒకరు చెప్పారు. నరేష్ గోయల్, ఆయన కుటుంబ సభ్యులు దేశం వదిలిపెట్టి వెళ్లకుండా చూడడం కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ అయిందని అధికార వర్గాలు తెలిపారు. జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన కేసులను తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు కార్యాలయం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

2014లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నరేష్ గోయల్‌కు చెందిన జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాలు తీసుకున్నప్పుడు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన జరిగి ఉండవచ్చన్న కోణంలో ఈ దర్యాప్తులు సాగుతున్నాయి. రూ.8,500 కోట్లకు పైగా రుణాల ఊబిలో కూరుకు పోయిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు దాదాపుగా మూతపడిన స్థితిలో ఉంది. ఆ సంస్థ విమాన సర్వీసులు అన్నీ నిలిచి పోగా, పైలట్లు సైతం వేరే దారి చూసుకుంటున్నారు. ఈ సంస్థను వేరే వారికి విక్రయించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాగా తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు దేశం వదిలివెళ్లకుండా చూడడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య మంచిదేనని, అయితే ఇదే చివరి చర్య కాకూడదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని జెట్ ఎయిర్‌వేస్ ఇంజనీరు ఒకరు వ్యాఖ్యానించారు.

Naresh Goyal Couple stopping at Mumbai airport

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముంబయి ఎయిర్‌పోర్టులో నరేష్ గోయల్ దంపతుల నిలిపివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: