ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు…

  * దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు * ఆసరాగా నిలుస్తున్న రైతుబంధు * ఎరువులు,విత్తనాలు సిద్ధంగా ఉంచిన అధికారులు నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్‌కు కోటి ఆశలతో సిద్ధమవుతున్నారు. ప్రస్తుత సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటనతో రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ పంటసాగుచేయడానికి శ్రీకారం చుడుతున్నారు. రబీ పంటలు కొన్ని మండలాల్లో ఆశించినంత పండకపోగా పలు మండలాల్లో సాగుచేసిన వరి నీరు అందక ఎండిపోయాయి. రబీ పంటల్లో నష్టపోయిన రైతులు నిరాశకు […] The post ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు
* ఆసరాగా నిలుస్తున్న రైతుబంధు
* ఎరువులు,విత్తనాలు సిద్ధంగా ఉంచిన అధికారులు

నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్‌కు కోటి ఆశలతో సిద్ధమవుతున్నారు. ప్రస్తుత సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటనతో రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ పంటసాగుచేయడానికి శ్రీకారం చుడుతున్నారు. రబీ పంటలు కొన్ని మండలాల్లో ఆశించినంత పండకపోగా పలు మండలాల్లో సాగుచేసిన వరి నీరు అందక ఎండిపోయాయి. రబీ పంటల్లో నష్టపోయిన రైతులు నిరాశకు లోనుకాకుండా ఖ రీఫ్‌లో పంటలు సాగు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రోహిణి కార్తి రాకముందే రైతులు తమ పొలాల ను ట్రాక్టర్లతో దున్నుకోవడంతో పాటు చెరువుల నుండి మ ట్టిని తరలిస్తున్నారు. చెరువుల మట్టిని పంట పొలాల్లో వేసుకుంటే కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉందని వ్యవసాయశా ఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఆసక్తిగా తమ పొ లాల్లోకి మట్టిని తరలిస్తున్నారు.

ఉపాధిహామీ పథకంలో భా గంగా చెరువుల నుంచి తీసిన పూడికను పంటపొలాల్లో రై తులు ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోతున్నారు. అలాగే త మ వ్యవసాయ భూములను ట్రాక్టర్ల సహాయంతో ప్లౌ, కల్టివేటర్‌తో దున్ని పంట సాగుచేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. భూములను దుక్కులు దున్ని సిద్ధం చేసుకోవడానికి ఆర్థికంగా డబ్బులు అవసరం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబందు పథకం రైతులకు ఆసరాగా నిలుస్తు ంది.మే చివరి వరకు రైతుబందు పథకంలో భాగంగా రైతు ల ఖాతాలోకి డబ్బులు నేరుగా పంపే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో నెల చివరి వరకు తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తే ఖరీఫ్‌లో సాగుచేస్తున్న పంటలకు పెట్టుబడులకు ఉపయోగపడుతాయని రైతులు ఆశాభావం వ్య క్తం చేస్తున్నారు.రైతులు తమ పంట పొలాలను చదును చే సుకుంటున్న తరుణంలో ప్రభుత్వపరంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం జీలుగ,పెద్దజనుములాంటి పచ్చి రొ ట్టె సాగుకు అధికారులు సహకారం అందించడంతో రైతు లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అలాగే ఖరీఫ్ సీజన్‌లో రై తులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ ప్రాథమిక కేం ద్రాల్లో సిద్ధంగా ఉంచారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముం దు జాగ్రత్తగా పలు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఖరీఫ్ పంటలో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే ఉమ్మడి జిల్లాల్లో వ్యవసాయశాఖ, పోలీస్‌శాఖ అనుబంధంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ప లు ఎరువుల, పురుగు మందుల దుకాణాల పై దాడులు నిర్వహించి కల్తీ విత్తనాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.ముందుగానే నకిలీ విత్తనాలను వ్యాపారులు రహస్య ప్రదేశాలలో నిల్వలు చేసే అవకాశంఉంటుందనే ఉద్దేశ్యం తో టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహి స్తూ కల్తీ విత్తనాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత సంవత్సరం సా ధారణ వర్షాపాతం కన్నా తక్కువగా కురియడంతో కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండలేకపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కరియ గా కేవలం సెప్టెంబర్ మాసం వరకే వర్షాలు కురిసాయి.అక్టోబర్ నుండి ఉమ్మడి జిల్లాలో ఎక్కడాభారీ వర్షాలు కురియకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. వర్షా లు లేకపోవడంతో పాటు వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో సాగునీ రు అందక సాగుచేసిన పంటలు ఎండిపోయా యి. ప్రస్తుత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు,కుంటలు నిండితేనే పంటలు పండుతాయని రైతులు తెలుపుతున్నారు. అ లాగే వర్షాధార పంటలుగా సాగుచేస్తున్న ప త్తి, మొక్కజొన్న పంట సాగు ఉమ్మడి జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది. కామారెడ్డి జిల్లాలోనే పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తుండగా మొ క్కజొన్న పంట కేవలం ఆర్మూర్ ప్రాంతంలోనే సాగు చేస్తున్నారు. రెండు పంటలకు కొత్తరకం పురుగులు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

పత్తిపంటకు గులాబి రంగు పురుగు బెడద ఉండగా మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు కలవరపెడుతుంది. అలాగే సోయాబీన్ పంట దిగుబడులు రోజురోజుకు తగ్గుతుండడంతో సోయాబీన్ పంట సాగుచేయడానికి రైతులు ఆసక్తి కనబర్చడం లేదు.వర్షాకాలంలో వరిప ంట సాగు చేయడానికి రైతులు ఎక్కువగా ఆ సక్తి కనబర్చినా సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే వరిపంట సాగు చేసే అవకాశాలు ఉంటాయి. నిజాంసాగర్,పోచారం ప్రాజెక్టులలో నీరు లేకపోవడంతో ప్రాజెక్ట్ కింద పంటలు సాగు చే యడానికి రైతులు ఆందోళనకు గురవుతున్నా రు. జూన్ మాసంలోనే భారీ వర్షాలు కురిస్తేనే పంటలు సాగుచేయడానికి రైతులు దైర్యంగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం పంటలకు కొత్తకొత్త తెగుళ్ళు, పు రుగులు ఆశించడంతో వాటిని నివారించేందు కు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప ంటలు సాగు చేయకముందే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు పంటల విషయంలో యాజమాన్య పద్ధతులను వివరించాలని అభ్యుదయ రైతులు కోరుతున్నారు.

Farmers Ready for Kharif

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: