రవాణా రంగంపై రూ.౩౦ లక్షల కోట్లు

  అయిదేళ్లలో మోడీ కొత్త సర్కార్ ప్రాధాన్యతలు రూ.100 లక్షల కోట్లకు చేరనున్న ప్రణాళికలు ఉపాధి కల్పనే లక్షంగా అమలు న్యూఢిల్లీ: తాము తిరిగి అధికారంలోకి వస్తే దేశ ఆర్థికాభివృద్ధిని, ఉపాధి కల్పనను పెంచడం కోసం రాబోయే అయిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో దాదాపు వంద లక్షల కోట్లు ఖర్చు చేస్తామని భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రణాళిక( మేనిఫెస్టో)లో తెలియజేసింది. ఏయే రంగాలకు ఏ మేరకు పెట్టుబడులు పెడతారో కూడా ఆ మేనిఫెస్టోలో తెలియజేశారు. […] The post రవాణా రంగంపై రూ.౩౦ లక్షల కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అయిదేళ్లలో మోడీ కొత్త సర్కార్ ప్రాధాన్యతలు
రూ.100 లక్షల కోట్లకు చేరనున్న ప్రణాళికలు
ఉపాధి కల్పనే లక్షంగా అమలు

న్యూఢిల్లీ: తాము తిరిగి అధికారంలోకి వస్తే దేశ ఆర్థికాభివృద్ధిని, ఉపాధి కల్పనను పెంచడం కోసం రాబోయే అయిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో దాదాపు వంద లక్షల కోట్లు ఖర్చు చేస్తామని భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రణాళిక( మేనిఫెస్టో)లో తెలియజేసింది. ఏయే రంగాలకు ఏ మేరకు పెట్టుబడులు పెడతారో కూడా ఆ మేనిఫెస్టోలో తెలియజేశారు. ఎన్నికలు ముగిసి నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి భారీ మెజారిటీతో రెండో సారి అధికార పీఠాన్ని అధిరోహించడానికి రంగం కూడా సిద్ధమైంది. ఈ నెల 30న నరేంద్ర మోడీ రెండో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు పూర్తయి జూన్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా సమర్పించనున్న తరుణంలో ఆ పార్టీ తన హామీలను నెరవేర్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. అయితే బిజెపి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రాబోయే అయిదేళ్ల కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయబోయే వంద లక్షల కోట్లలో దాదాపు మూడో వంతు రవాణా రంగంపైనే ఖర్చు చేయనుంది. ఈ మొత్తంలో అధిక భాగం రైల్వేలు, నదుల అనుసంధానం, హైవేల విస్తరణ కార్యక్రమాలపైనే పెట్టుబడి పెట్టనుంది. ఇదే కాకుండా రక్షణ రంగం అధునీకరణ కోసం రూ.9 లక్షల కోట్ల ప్రణాళిక కూడా దీనిలో ఉంది. రవాణా రంగానికి చేయబోయే భవిష్యత్తు ఖర్చులో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు బులెట్ రైళ్లు, సరకు రవాణాకు సంబంధించి ప్రత్యేక కారిడార్ల నిర్మాణం కోసం కేటాయిస్తారు. దాదాపు రూ.3 లక్షల కోట్లు రేవుల రంగానికి రాబేయే అయిదేళ్లలో కేటాయించాలని ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో అధిక భాగం సాగరమాల ప్రాజెక్టు కోసం కేటాయించారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత
రైల్వే, రోడ్లు, రేవులు, విమానాశ్రయాలు లాంటి మౌలిక సదుపాయాల రంగాలపైనే కాకుండా సామాజిక మౌలిక సదుపాయాలైన విద్య, వైద్య రంగాలకు, వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ రంగాల్లో అవసరమైన మేరకు పెట్టుబడులను ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. చేపట్టిన పథకాల అమలు వేగం పుంజకున్నప్పుడు, అలాగే పథకాల అమలు సమయంలో తలెత్తే కొత్త అవసరాలకు అనుగుణంగా ఈ రంగాలకు కేటాయింపులు పెంచడం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రణాళిల అమలుకోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరపడంతో పాటుగా తగ్గిన నిధులను ఇతర మార్గాల ద్వారా భర్తీ చేయడం, ప్రభుత్వ రంగ కంపెనీల పెట్టుబడులను కూడా మూలధనం వ్యయంలో చేర్చడం జరుగుతుంది. 2013-14ఆర్థిక సంవత్సరంనుంచి మూల ధన వ్యయం దాదాపు 113 శాతం పెరిగి9.6 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే విధంగా రాబోయే అయిదేళ్ల కాలంలో శరవేగంగా జరగనున్న జిడిపి వృద్ధికి అనుగుణంగా ఈ మూలధన పెట్టుబడి వ్యయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దీని ఫలితంగా కంపెనీలు కార్మిక రంగంపై జరిపే వ్యయం రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఫలితంగా మరింత వేగంగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని భావిస్తున్నారు.

నదుల అనుసంధానం

అనేక కారణాల వల్ల మూలన పడిన నదుల అనుసంధానం కార్యక్రమాన్ని తిరిగి పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి పట్టుదలతో ఉన్నారని, మిగులు జలాలను లోటు ప్రాంతాలకు తరలించడం కోసం 37 నదుల అనుసంధానాన్ని చేపట్టనున్నట్లు పార్టీ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి దాదాపు 11లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తుండగా, రాబోయే అయిదేళ్లలో ఇందుకోసం రూ.7 లక్షల కోట్లను కేటాయించవచ్చని పేర్కొన్నారు. కాగా పట్టణ ప్రాంతాల్లో ఇతర మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం కోసం మరో 7 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే దాదాపు 2కోట్ల గృహాలను నిర్మించడం కోసం పట్టణ ప్రాంత గృహనిర్మాణ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించడానికి రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని కూడా పార్టీ వర్గాలు తెలియజేశాయి. గ్రామాలనుంచి నగరాలు, పట్టణ ప్రాంతాలకు వలసలు శరవేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఏర్పడింది.

Modi likely to be sworn in for second term on May 30

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రవాణా రంగంపై రూ.౩౦ లక్షల కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: