ఓ బేబీ టీజర్ వచ్చేసింది…

  హైదరాబాద్‌: అక్కినేని సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘నా పేరు సావిత్రి.. చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలా […] The post ఓ బేబీ టీజర్ వచ్చేసింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: అక్కినేని సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘నా పేరు సావిత్రి.. చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలా ఉన్నావు అనేవాళ్లు’ అంటూ నటి లక్ష్మి చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘మీకు బాయ్‌ఫ్రెండ్‌ ఎవరూ లేరుకదా?’ అని సమంతను నాగశౌర్య అడుగగా.. ‘హా.. నేను మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నానిగాడు పుట్టేశాడు. నాని గాడిని పెంచి పెద్ద చేయడమే సరిపోయింది. వాడు పెళ్లి చేసుకుని ఇద్దర్ని కన్నాడు, వాళ్లు కూడా పెళ్లీడుకొచ్చేశారు.. నాకు వయసు అయిపోయింది’ అని ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారుగా..’ అని చివర్లో సమంత చెప్పే డైలాగ్ సరదాగా అనిపించింది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాగశౌర్య, రావు రమేశ్‌, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Oh! Baby teaser released

The post ఓ బేబీ టీజర్ వచ్చేసింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: