కెసిఆర్ తో జగన్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ తో వైసిపి చీఫ్ జగన్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఎపిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎపిలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలను వైసిపి గెలిచింది. టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో వైసిపి ఎంఎల్ఎలు భేటీ అయ్యారు. వీరు తమ శాసనసభా పక్ష […] The post కెసిఆర్ తో జగన్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ తో వైసిపి చీఫ్ జగన్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఎపిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎపిలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలను వైసిపి గెలిచింది. టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో వైసిపి ఎంఎల్ఎలు భేటీ అయ్యారు. వీరు తమ శాసనసభా పక్ష నేతగా జగన్ ను ఎన్నుకున్నారు. అనంతరం జగన్ హైదరాబాద్ కు వచ్చి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటే చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరారు. అనంతరం జగన్ నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లారు. అక్కడ జగన్ కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పలువురు తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో జగన్ కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఈనెల 30న విజయవాడలో సిఎంగా తాను చేసే ప్రమాణస్వీకార కార్యక్రమానికి  రావాలని కెసిఆర్ ను జగన్ ఆహ్వానించారు. ఎపి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన జగన్ ను కెసిఆర్ అభినందించారు. జగన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జగన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలువనున్నారు.

YCP Chief jagan Meets Telangana CM KCR

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కెసిఆర్ తో జగన్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: