గాల్లో విమానం ఉండగా.. ఇంటికెళ్లాలి ఆపండంటూ…

కున్ మింగ్: విమానం గాల్లో ఉండగా ఇంటికెళ్లాలి ఆపండంటూ ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్దకెళ్లి హంగమా సృష్టించిన సంఘటన ఛైనాకు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. వివరాలు చూస్తే… ఛైనా విమానం ఫుజో నుంచి కన్ మింగ్ కు బయలుదేరింది. కొద్ది సేపట్లో గమ్య స్థలానికి చేరుకోనుండగా… ఆ విమానంలోని ఓ ప్యాసింజర్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో అతడు విమాన సిబ్బందికి పిలిచి తన కుటుంబ సభ్యులతో […] The post గాల్లో విమానం ఉండగా.. ఇంటికెళ్లాలి ఆపండంటూ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కున్ మింగ్: విమానం గాల్లో ఉండగా ఇంటికెళ్లాలి ఆపండంటూ ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్దకెళ్లి హంగమా సృష్టించిన సంఘటన ఛైనాకు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. వివరాలు చూస్తే… ఛైనా విమానం ఫుజో నుంచి కన్ మింగ్ కు బయలుదేరింది. కొద్ది సేపట్లో గమ్య స్థలానికి చేరుకోనుండగా… ఆ విమానంలోని ఓ ప్యాసింజర్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో అతడు విమాన సిబ్బందికి పిలిచి తన కుటుంబ సభ్యులతో మాట్లాడలని, వాళ్లకు కాల్ చేయాలని కోరాడు.

అయితే అప్పుడు కాల్ చేయడం కుదరని విమాన సిబ్బంది అతనికి సర్దిచెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు తీయబోయాడు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు అతన్ని తాడుతో కట్టేసి నిలువరించారు. ఈ ఘర్షణలో ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం కున్ మింగ్ లో ల్యాండ్ కాగానే అతన్ని పోలీసులకు అప్పజేప్పారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని గమనించిన పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.

Passenger Tries Open Emergency Door in Mid Flight

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గాల్లో విమానం ఉండగా.. ఇంటికెళ్లాలి ఆపండంటూ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: