పొలాలకు జలాలు…

  ఏడాది పొడుగునా సాగునీరు పారాలి కాలువలు, తూములకు తక్షణమే మరమ్మతులు 20 రోజుల్లో పూర్తి చేయాలి నీరు చివరి వరకు చేరేలా కాలువల వ్యవస్థ బలోపేతం కాలువల నిర్వహణ కోసం సమగ్రవ్యూహం తక్షణమే నిధుల విడుదల ప్రగతి భవన్ సమీక్షలో సిఎం కెసిఆర్ తెలంగాణ ఇప్పటి వరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలతో పాటు, ఇతర కాలువలలో మూడు, నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. ఇకపై […] The post పొలాలకు జలాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏడాది పొడుగునా సాగునీరు పారాలి

కాలువలు, తూములకు తక్షణమే మరమ్మతులు
20 రోజుల్లో పూర్తి చేయాలి
నీరు చివరి వరకు చేరేలా కాలువల వ్యవస్థ బలోపేతం
కాలువల నిర్వహణ కోసం సమగ్రవ్యూహం
తక్షణమే నిధుల విడుదల
ప్రగతి భవన్ సమీక్షలో సిఎం కెసిఆర్

తెలంగాణ ఇప్పటి వరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలతో పాటు, ఇతర కాలువలలో మూడు, నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. ఇకపై ఆ దుస్థితి తొలగుతుంది. నీటిని పంట పొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాలువల నిర్వహణను గతంలో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇకపై వర్షం పడ్డా, పడకున్నా ప్రాణహిత ద్వారా గోదావరి నీళ్లు పుష్కలంగా వస్తాయి.

హైదరాబాద్: కాలువలు, తూములు, జలాశయాల గేట్లు, రెగ్యులేటర్లను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే 20 రోజుల్లో వీటిని పూర్తిచేయాలని సిఎం గడువు విధించారు. ఇందుకు కావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేస్తామన్నారు. ఇప్పటి దాకా కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఇకపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగ్గట్లుగానే కాల్వల నిర్వహణ కోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు, తూములను నిర్వహించడానికి సర్వసన్నద్ధం కావాలని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ ఇప్పటి వరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలతో పాటు, ఇతర కాలువలలో మూడు, నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవని, ఇకపై ఆ దుస్థితి మారుతుందని సిఎం అన్నారు. నీటి ప్రవాహాన్ని పంట పొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాలువల నిర్వహణను గతంలో పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, ఇకపై వర్షం పడ్డా, పడకున్నా ప్రాణహిత ద్వారా, గోదావరి నీళ్లు పుష్కలంగా వస్తాయని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని, మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరుకు నీరు చేరుతుందన్నారు. మిడ్ మానేరు నుంచి ఓ వైపు మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు, మరో వైపు శ్రీరాంసాగర్‌కు పంపింగ్ జరుగుతుందన్నారు.

ఈ నేపధ్యంలో నీటిపారుదల శాఖ అప్రమత్తం కావాలని, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు నింపుతామని స్పష్టం చేశారు. ఆయా జలాశయాల్లో తూములు, గేట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, ఎప్పుడంటే అప్పుడు గేట్లు ఎత్తేలా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వరద కాలువ, కాకతీయ కాలువ, సరస్వతి కాలువ, గుత్ప కాలువ, అలీసాగర్ కాలువ అన్నింటినీ సిద్ధం చేయాలని, ఈ కాలువల తూములు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు ఎలా ఉన్నాయో పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులను వచ్చే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. దీనికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని కెసిఆర్ అన్నారు. నీటి మళ్లింపు పనులు పర్యవేక్షించేందుకు అవసరమైన లస్కర్లను నియమించుకోవాలని, కాలువల మొదటి నుంచి చివరి వరకు కూడా నీటి ప్రవాహానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను సర్వసన్నద్ధం చేయాలని ఆదేశించారు. కాలువల వెంట పూర్తిసామర్థంతో నీటి ప్రవాహం ఉంటుందని, రెండు వైపులా ఒడ్డులు పటిష్టంగా ఉండేటట్లు చూడాలని, ఇందుకోసం నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వర్క్‌షాప్ ఏర్పాటు చేసి, విధానాన్ని ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లకు తరలించే క్రమంలో కొన్ని బాలారిష్టాలను ఎదురవుతాయని, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని సిఎం ఇంజనీర్లకు జాగ్రత్తలు చేపట్టారు. బ్యారేజిల నుంచి రిజర్వాయర్లకు, చెరువులకు నీళ్లు పంపించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. బ్యారేజిల నుంచి రిజర్వాయర్లకు నీరు అంది, రిజర్వాయర్ల నుంచి పంట పొలాల వరకు నీరు చేరే వరకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి, ఎక్కడికక్కడ పనులు నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, హరేరామ్, చీఫ్ ఇంజనీర్లు ఖగేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Give Water to Crops Throughout the Year

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పొలాలకు జలాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: