సత్తా చాటని వారసత్వాలు

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల్లో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల కుమారులు ఘోరంగా ఓడిపోవడాన్ని పరిశీలిస్తే ‘వారసత్వం’ అంశం పనిచేయలేదనిపిస్తుంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కంచుకోట అయిన అమేథీలో ఓటమి పాలయ్యారు. అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ జోథ్‌పూర్‌లో ఓడిపోయారు. ముందు తరం నాయకుల విజయాలు ఈ తరం రాజకీయ వారసులను ఆదుకోలేకపోతున్నాయని ఇందువల్ల తెలుస్తోంది. రాహుల్‌గాంధీ తన ప్రత్యర్థి స్మృతి ఇరానీ […] The post సత్తా చాటని వారసత్వాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల్లో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల కుమారులు ఘోరంగా ఓడిపోవడాన్ని పరిశీలిస్తే ‘వారసత్వం’ అంశం పనిచేయలేదనిపిస్తుంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కంచుకోట అయిన అమేథీలో ఓటమి పాలయ్యారు. అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ జోథ్‌పూర్‌లో ఓడిపోయారు. ముందు తరం నాయకుల విజయాలు ఈ తరం రాజకీయ వారసులను ఆదుకోలేకపోతున్నాయని ఇందువల్ల తెలుస్తోంది. రాహుల్‌గాంధీ తన ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక వైభవ్ అయితే ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆయన బిజెపి అభ్యర్థి గజేంద్రసింగ్ షెకావత్ చేతిలో 2.7లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లో మాజీ కేంద్రమంత్రి మాధవరావు సింధియా తనయుడు, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాదిత్య తమ కుటుంబానికి బాగా పట్టున్న గుణ స్థానంలో ఓడిపోయారు. 1999 నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. రాజస్థాన్ బార్మర్ నియోజకవర్గంలో …భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జస్వంత్ సింగ్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి మానవేంద్ర సింగ్ 3.2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ కొడుకు పార్థ్ మావల్‌లో, మురళీ డియోరా కుమారుడు మిలింద్ డియోరా దక్షిణ ముంబయిలో, శంకరరావు చౌహాన్ తనయుడు అశోక్ చవాన్ నాందేడ్‌లో ఓడిపోయారు. దక్షిణాది విషయానికి వస్తే కర్ణాటకలో జెడి (ఎస్) టిక్కెట్‌పై పోటీ చేసిన ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మాండ్యాలో సినీనటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఓటమిపాలయ్యారు. ఇలా ఉండగా, రాజకీయ నాయకుల కుమార్తెలు విజయం సాధించారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె మహారాష్ట్రలోని బారామతి స్థానం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా పోటీ చేసి, బిజెపి అభ్యర్థి కాంచన్ రాహుల్ కూల్‌పై 1.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కుమార్తె కనిమోళి3.47 లక్షల ఓట్ల మెజారిటీతో తూతుక్కుడి నుంచి గెలిచారు.

Rahul Gandhi loses Amethi to Smriti Irani

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సత్తా చాటని వారసత్వాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: