ఆ మూడింట బిజెపికి 61

న్యూఢిల్లీ: అయిదు నెలల క్రితం బిజెపి అధికారంలో ఉండిన ఆ మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడంతో కమలనాథుల పని అయిపోయిందని, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పతనం ఇక్కడినుంచే మొదలయిందని అందరూ వ్యాఖ్యానించడం మొదలైంది. అయితే తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలోని మొత్త 65 లోక్‌సభ స్థానాలకు గాను 61 స్థానాలకు గెలచుకొని […] The post ఆ మూడింట బిజెపికి 61 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: అయిదు నెలల క్రితం బిజెపి అధికారంలో ఉండిన ఆ మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడంతో కమలనాథుల పని అయిపోయిందని, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పతనం ఇక్కడినుంచే మొదలయిందని అందరూ వ్యాఖ్యానించడం మొదలైంది. అయితే తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలోని మొత్త 65 లోక్‌సభ స్థానాలకు గాను 61 స్థానాలకు గెలచుకొని కాషాయ పార్టీ మళ్లీ తన పట్టును నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లో 28 స్థానాలను, రాజస్థాన్‌లో 25 సీట్లకు 24,చత్తీస్‌గఢ్‌లో 11స్థానాల్లో తొమ్మిదింటిని బిజెపి గెలుచుకుంది. దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ తాను పాలిస్తున్న ఈ మూడు రాష్టాల్లోను ముచ్చటగా మూడు స్థానాలకు పరిమితమైంది. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ కమల్‌నాథ్ చింద్వారాలోమాత్రమే విజయం సాధించారు. సుదీర్ఘ కాలంగా ఇక్కడినుంచి ఎంపిగా ఎన్నికవుతూ వస్తున్న కమల్‌నాథ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చెందిన శివరాజ్‌సింగ్‌చౌహాన్ ప్రభుత్వాన్ని గద్దుదింపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇక్కడ నకుల్ తన సమీప బిజెపి ప్రత్యర్థి నథన్‌సాహా కావ్రెట్టిపై 38 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోట అయిన గుణలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బిజెపి ప్రత్యర్థి కృష్ణపాల్ సింగ్ చేతిలో లక్షా 25 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్కిన స్థానాలు ఈ రెండే. ఇక రాజస్థ్థాన్‌లో ఆ పార్టీకి ఆ ఒక్కటి కూడా దక్కలేదు. రాష్ట్రంలోని 25 స్థానాల్లో బిజెపి 24 చోట్ల విజయ భేరి మోగించగా, మిగతా ఒక్క స్థానం నాగౌర్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా తెరపైకి వచ్చిన లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన హనుమాన్ బేణీవాల్‌కు దక్కింది. చత్తీస్‌గఢ్‌లో కూడా కాగ్రెస్‌కు దక్కింది రెండు స్థానాలే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన బస్తర్, కోర్బా నియోజక వర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ విజయం సాధించింది. మిగతా 9 చోట్ల బిజెపి విజయం సాధించింది.

BJP 61 Seats Win In Lok Sabha Elections in Three States

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ మూడింట బిజెపికి 61 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: