మోడీకి అద్వానీ, జోషి ఆశీర్వాదం

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోడీ శుక్రవారంనాడు ఇద్దరు అగ్రనేతలను కలిశారు. తొలుత బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీని ఆయన నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎన్నికల సమయంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని కూడా ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఈ సమయంలో మోడీ వెంట బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. తొలుత ఉదయం […] The post మోడీకి అద్వానీ, జోషి ఆశీర్వాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మోడీ శుక్రవారంనాడు ఇద్దరు అగ్రనేతలను కలిశారు. తొలుత బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీని ఆయన నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎన్నికల సమయంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని కూడా ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఈ సమయంలో మోడీ వెంట బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. తొలుత ఉదయం ఆద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ, షా బిజెపి విజయాన్ని ఆయనతో పంచుకున్నారు. పార్టీ తదుపరి కార్యాచరణ, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అంశాలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆద్వాణీ నుంచి వీరిద్దరూ నేరుగా మురళీ మనోహర్ జోషీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షాలను జోషీ సాదరంగా ఆహ్వానించారు. సంబంధింత ఫొటోలను మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
‘ఆద్వానీ లాంటి గొప్ప నేతలు దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడం వల్లే నేడు బిజెపి ఈ విజయాన్ని సాధించగలిగింది’ అని మోడీ పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్‌లో ‘డాక్టర్ మురళీ మనోహర్ జోషీ గొప్ప విద్యావేత్త. మేధావ్తి, సమర్థత కలిగిన నేత. భారత విద్యా విధానాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. బిజెపి బలోపేతం చేసేందుకు ఆయన కృషిచేశారు. నాతో సహా ఎంతో మంది కార్యకర్తలను మార్గనిర్దేశం చేశారు. నేడు ఆయనను కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను’ అని ట్వీట్ చేశారు.

PM Modi meets BJP veterans LK Advani and MM Joshi  

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీకి అద్వానీ, జోషి ఆశీర్వాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: