17చోట్ల కాంగ్రెస్‌కు గుండు సున్నా

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. నవ భారత నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ, ‘గరీబీ హఠావో’ నినాదంతో ప్రజల గుండెల్లో నిలిచిన ఇందిర వంటి నేతలు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం ఒక్క లోక్‌సభ స్థానాన్ని అయినా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకు దేశవ్యాప్తంగా 52 స్థానాలు మాత్రమే లభించాయి. దాదాపు దేశంలోని సగ భాగానికి లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం […] The post 17చోట్ల కాంగ్రెస్‌కు గుండు సున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. నవ భారత నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ, ‘గరీబీ హఠావో’ నినాదంతో ప్రజల గుండెల్లో నిలిచిన ఇందిర వంటి నేతలు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం ఒక్క లోక్‌సభ స్థానాన్ని అయినా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకు దేశవ్యాప్తంగా 52 స్థానాలు మాత్రమే లభించాయి. దాదాపు దేశంలోని సగ భాగానికి లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం కాంగ్రెస్‌కు దక్కలేదు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీరు, మణిపూర్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్-నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్‌లలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ పరిస్థితిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా నష్టపోయింది. 17 యూనిట్లలో కాంగ్రెస్‌కు పెద్ద సున్నా వచ్చింది’ అన్నారు.

Congress Party at least One Seat Not win 17 seats

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 17చోట్ల కాంగ్రెస్‌కు గుండు సున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: