నేడు ఎన్‌డిఎ ఎంపిల భేటీ…

  పార్లమెంటరీ నాయకుడుగా మోడీ ఎన్నిక బిజెపి బలం 303, కాంగ్రెస్ 52, డిఎంకె 23, టిఎంసి 22, వైసిపి 22 న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకోవడం కోసం కొత్తగా ఎన్నికయిన బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎంపిలు శనివారం ఇక్కడ సమావేశం కానున్నారు. దీనితో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రాంఢమయినట్లవుతుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాలులో ఈ సమావేశం జరుగుతుందని బిజెపి వర్గాలు తెలిపాయి. కాగా ఎన్‌డిఎ […] The post నేడు ఎన్‌డిఎ ఎంపిల భేటీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పార్లమెంటరీ నాయకుడుగా మోడీ ఎన్నిక
బిజెపి బలం 303, కాంగ్రెస్ 52, డిఎంకె 23, టిఎంసి 22, వైసిపి 22

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకోవడం కోసం కొత్తగా ఎన్నికయిన బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎంపిలు శనివారం ఇక్కడ సమావేశం కానున్నారు. దీనితో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రాంఢమయినట్లవుతుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాలులో ఈ సమావేశం జరుగుతుందని బిజెపి వర్గాలు తెలిపాయి. కాగా ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికయిన తర్వాత ప్రధాని మోడీ ఎంపిలనుద్దేశించి మాట్లాడుతారని భావిస్తున్నారు. నరేంద్ర మోడీని ఇప్పటికే ఎన్‌డిఎ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించినందున ఈ సమావేశం కేవలం లాంఛనప్రాయమే. లోక్‌సభలో బిజెపి ఇప్పటికే 302 స్థానాలను గెలుచుకోగా, ఒక స్థానం ఫలితం పెండింగ్‌లో ఉంది. కాగా ఎన్‌డిఏ కూటమి స్థానా ల సంఖ్య 350కి చేరువలో ఉంది.

NDA MPs Today Meet

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు ఎన్‌డిఎ ఎంపిల భేటీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: