కమలదళం బలం 303

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో అద్భుత విజయం సాధించి రెండో సారి తిరిగి అధికారంలోకి రానున్న భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియపై చర్చిస్తుండగా, మరో వైపు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల రాజీనామాలకు సిద్ధం కావడంతో మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దాదాపు నెలన్నర పాటు సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ అనంతరం గురువారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయానికి దాదాపుగా […] The post కమలదళం బలం 303 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో అద్భుత విజయం సాధించి రెండో సారి తిరిగి అధికారంలోకి రానున్న భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియపై చర్చిస్తుండగా, మరో వైపు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల రాజీనామాలకు సిద్ధం కావడంతో మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దాదాపు నెలన్నర పాటు సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ అనంతరం గురువారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయానికి దాదాపుగా పూర్తయింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి 302 స్థానాల్లో వేసుకుని మరో స్థానంలో ఆధిక్యతలో ఉంది. ఓ వైపు మోడీ వేవ్‌తో బిజెపి 2014లో తాము సాధించిన స్థానాలకు మించి గెలుపొందగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీగత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 44 స్థానాలకన్నా కొద్దిగా మెరుగుపర్చుకుని 52 స్థానాల్లో గెలుపొందింది. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఆ పార్టీకి దక్కాలంటే మరో రెండు సీట్లు అవసరముంది. కాగా కాంగ్రెస్ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీలు ప్రాంతీయ పార్టీలే కావడం గమనార్హం.

తమిళనాడులో 23 స్థానాల్లో విజయం సాధించిన డిఎంకె కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ , జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి చెరి 22 సీట్లతో మూడో స్థానంలో నిలిచాయి. 18 స్థానాలతో శివసేన,16 స్థానాలతో జెడి(ఎస్) లోక్‌సభలో తమ ఉనికిని చాటుకున్నాయి. అయితే మిగతా ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా యుపిలోని పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీకి అయిదు స్థానాలు దక్కగా, దాని భాగస్వామి బిఎస్‌పి పది సీట్ల గెలుచుకుంది. కాగా బిజెపి , దాని మిత్రపక్షమైన అప్నాదళ్ రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో 64 చోట్ల జయకేతనం ఎగురవేశాయి. కాగా, వామపక్షాలకు కేవలం 5 స్థానాలు దక్కగా, అందులో సిపిఎంకు మూడు, సిపిఐకి రెండు సీట్లు లభించాయి. 2014 ఎన్నికలో లెఫ్ట్ పార్టీలకు పది స్థానాలు దక్కగా, ఇప్పుడు ఆ బలం సగానికి తగ్గింది. ఈ పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా లేదా ర్హాగానాలకు దారితీస్తోంది. మరోవైపు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ యుపి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్, ఒడిశా పిసిసి అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, కర్నాటక చీఫ్ హెచ్‌కె పాటిల్‌లు తమ రాజీనామా లేఖలను పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే పంపించారు.

ఈ ఫలితాలు యుపి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ కలిగించాయని, పార్టీ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా లేఖను నంపించినట్లు రాజ్‌బబ్బర్ ఒక ట్వీట్‌లో తెలిపారు. ఫతేపూర్ సిక్రీలో రాజ్‌బబ్బర్ దాదాపు 4.95 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక లోక్‌సభ. ౯ అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అసెంబ్లీకి పోటీ చేసిన పట్నాయక్ పరాజయం పాలయ్యారు. ఇక్కడ కూడా మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాలు దక్కించుకుని బిజెపి సత్తా చాటింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కస్థానమే దక్కింది. కాగా, అయిదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కూడా కాంగ్రెస్‌Xyరపరాజయాన్ని మూటగట్టుకుంది. బిజెపి వేవ్‌కు ఈ మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. మూడు రాష్ట్రాల్లో కలిపి 65 లోక్‌సభ స్థానాలు ఉండగా బిజెపి 61 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.

BJP Win 303 Seats In Lok Sabha Elections 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కమలదళం బలం 303 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: