ఎపిలో జాడలేని జాతీయ పార్టీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు సైతం దక్కలేదు. అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ 1.17 శాతం, బీజేపీ 0.84 శాతం ఓట్లకు పరిమితమయ్యాయి. కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. అదేవిధంగా జనసేన, మిత్రపక్షాల అభ్యర్థులు సైతం అనేక చోట్ల […] The post ఎపిలో జాడలేని జాతీయ పార్టీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు సైతం దక్కలేదు. అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ 1.17 శాతం, బీజేపీ 0.84 శాతం ఓట్లకు పరిమితమయ్యాయి. కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. అదేవిధంగా జనసేన, మిత్రపక్షాల అభ్యర్థులు సైతం అనేక చోట్ల డిపాజిట్లు సాధించలేకపోయారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.15 శాతం ఓట్లు నమోదు కాగా టీడీపీకి 39.6 శాతం ఓట్లు వచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య పది శాతం ఓట్ల తేడా నెలకొంది .జాతీయ పార్టీలు కాంగ్రెస్ (1.29 శాతం) బీజేపీ (0.96 శాతం) ఓట్లు రాగా నోటాకు 1.49 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన, సీపీఐ, సీపీఎంలతో పాటు మిగిలిన స్వతంత్రులందరికీ కలిపి 7.3 శాతం మేరకు ఓట్లు లభించాయి.

ఈ నేపథ్యంలో ఎపి శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలలో 10 శాతం ఓట్లను సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 (49.95) శాతం ఓట్లను సాధించగా, టీడీపీకి 39.18 శాతం ఓట్లు దక్కాయి. వైఎస్సార్, టిడిపిల మధ్య 10.7 శాతం (దాదాపు 11 శాతం) ఓట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఎపిలో 175 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం (1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే జనసేనకు 6 శాతం, జనసేన మిత్రపక్షాలైన సీపీఐ (0.11 శాతం), సీపీఎం (0.32 శాతం), బీఎస్పీ (0.28 శాతం) ఓట్లు నమోదయ్యాయి. ఇదిలావుండగాఎపిలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో నోటాకు 1.28 శాతం (4,01,968 ఓట్లు) నమోదయ్యాయి. జనసేన మిత్రపక్షాలైన సీపీఐ,, సీపీఎం, బీఎస్పీ పార్టీలన్నింటకీ కలిపి నోటాకు పోలైనన్ని ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

National Parties Not Win In AP Assembly Election

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపిలో జాడలేని జాతీయ పార్టీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: