పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌ : వారం రోజుల నుంచి ఎండలు క్రమంగా పెరిగి పోతుండడంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎండకు తోడు వడగాల్పుల తీవ్రత పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. 10 గంటల తరువాత ప్రజలు ఇళ్ల నుంచి బయటికు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితులలో మినహా బయటకు రావడం లేదు. బయటకు రావాలంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులు, […] The post పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్‌ : వారం రోజుల నుంచి ఎండలు క్రమంగా పెరిగి పోతుండడంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎండకు తోడు వడగాల్పుల తీవ్రత పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. 10 గంటల తరువాత ప్రజలు ఇళ్ల నుంచి బయటికు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితులలో మినహా బయటకు రావడం లేదు. బయటకు రావాలంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. శుక్రవారం ఆదిలబాద్‌లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నప్పటికీ చల్లదానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడగాలులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, తప్పని సరి పరిస్థితులలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రజలు చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో పట్టణంలోని పలు ప్రాంతాలలో వెలిసిన శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్ విక్రయ కేంద్రాలకు గీరాకీ పెరిగింది.

People Suffer From Temperature

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: