ప్రశ్నార్థకమైన జి.డి.పి

  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర గల సమాచారాన్ని రిజర్వు బ్యాంకు విశ్లేషిస్తుంది. అందులో మూడు లక్షల కంపెనీల సమాచారమే ఉంది. వీటి మూలధన పెట్టుబడి క్రియాశీల కంపెనీల పెట్టుబడిలో మూడింట ఒక వంతు కూడా ఉండదు. న్.ఎస్.ఎస్.ఒ. వెల్లడించిన అంశాలను చూస్తే ప్రైవేటు కార్పొరేట్ రంగం వ్యవహారాల్లో అనేక లొసుగులున్నాయని తేలిపోయింది. మన దేశంలో చాలా కంపెనీలను కార్పొరేట్ రంగంలో చేరడానికే రిజిస్టర్ చేస్తారు కాని ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి చేయడానికి […] The post ప్రశ్నార్థకమైన జి.డి.పి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర గల సమాచారాన్ని రిజర్వు బ్యాంకు విశ్లేషిస్తుంది. అందులో మూడు లక్షల కంపెనీల సమాచారమే ఉంది. వీటి మూలధన పెట్టుబడి క్రియాశీల కంపెనీల పెట్టుబడిలో మూడింట ఒక వంతు కూడా ఉండదు. న్.ఎస్.ఎస్.ఒ. వెల్లడించిన అంశాలను చూస్తే ప్రైవేటు కార్పొరేట్ రంగం వ్యవహారాల్లో అనేక లొసుగులున్నాయని తేలిపోయింది. మన దేశంలో చాలా కంపెనీలను కార్పొరేట్ రంగంలో చేరడానికే రిజిస్టర్ చేస్తారు కాని ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి చేయడానికి సేవలు అందించడానికి కాదు. అసలు లెక్కలు సమర్పించే కంపెనీల సంఖ్యే తక్కువ అయినప్పుడు కేంద్ర గణాంకాల కార్యాలయం దాదాపు పది లక్షల కంపెనీలు క్రియాశీలంగా పని చేస్తున్నాయని చెప్తోంది. ఇంతకు ముందు చిన్న కంపెనీలకు సంబంధించిన సమాచారం ఉండేది కాదని తాము ఆ సమాచారం అందుబాటులో ఉంచుతున్నామని గణాంకాల కార్యాలయం చెప్తోంది. కాని దీనికోసం అనుసరించే ప్రక్రియ ఎక్కువగా అంచనా వేయడానికి దారి తీస్తోందని విమర్శకులు అంటున్నారు.

కేంద్ర గణాంకాల కార్యాలయం (సి.ఎస్.ఒ.) 2015లో స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.) అంచనా వేయడానికి కొత్త పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈ కొత్త విధానంలో ఐక్య రాజ్య సమితి జాతీయ ఖాతాలు, 2008నాటి మార్గదర్శక సూత్రాలు చేర్చారు. ఈ పద్ధతి ప్రకారం జి.డి.పి.లో ప్రైవేటు కార్పొరేట్ రంగం చట్టబద్ధంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించే తమ ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల జి.డి.పి.లో ప్రైవేట్ కార్పొరేట్ రంగం వాటా మునుపటికన్నా ఎక్కువైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ పెరుగుదల స్థూల ఆర్థిక గణాంకాలతో, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న సమాచారంతో సరిపోలడం లేదు. దీని మీద అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

కార్పొరేట్ సంస్థలు చూపే అదనపు విలువను ఆ సంస్థల ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రభుత్వ రి-పోర్టల్ లో ఉన్న సమాచారం ఆధారంగా నిర్ధారించడంవల్ల జి.డి,పి. అంచనాను మరీ పలచన చేసినట్టు అయిం ది. ప్రస్తుత ప్రభుత్వం ఇందులో ఉన్న సంక్లిష్టతను పట్టించుకోవడం లేదు. ఆర్థికేతర సేవల రంగానికి సంబంధించి ఇటీవల నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయం (ఎన్.ఎస్.ఎస్.ఒ.) నివేదికలోని అంశాలను చూస్తే జి.డి.పి. అంచనా మరింత నిరాశ కలిగిస్తోంది. ఎందుకంటే ఎన్.ఎస్.ఎస్.ఒ. సేకరించిన నమూనాలను చూస్తే 45 శాతం కార్పొరేట్ సంస్థలు ఎన్.ఎస్. ఎస్.ఒ.కు సమాచారం అందించనే లేదు.

2008 గణాంకాల చట్టం ప్రకారం వీటి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఈ లెక్కలు ఎంత అనుమానాస్పదంగా ఉన్నాయంటే ఎన్.ఎస్.ఎస్.ఒ. రెండు సంపుటాలుగా ప్రకటించదలచుకున్న నివేదికలను వెలువరించనే లేదు. కేవలం చిన్న సాంకేతిక నివేదికనే వెలువరించింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు తాము చట్టబద్ధంగా అందించవలసిన వివరాలు అందించనే లేదు. కొన్ని కంపెనీలు అసలు నివేదికలే సిద్ధం చేయలేదు. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు దాదాపు పది లక్షలున్నాయని అంచనా. వీటిలో చాలా కంపెనీలు గత మూడు సంవత్సరాలలో ఒక్క సారైనా సమాచారం అందించలేదు. ఈ కంపెనీల్లో 60,000 కంపెనీలు క్రియాశీలంగా ఉన్నవే. ఇవి పెద్ద కంపెనీలు. ఇవి విస్తరించగలిగిన వ్యాపార నివేదిక భాషలో సమాచారం అందిస్తాయి. మిగతా కంపెనీలు అర కొర సమాచారంతో అందజేస్తాయి. ఈ సమాచారం అందించడం చట్టబద్ధంగా చేయవలసిన పనే అయినా అది అరకొరగానే సాగుతోంది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర గల సమాచారాన్ని రిజర్వు బ్యాంకు విశ్లేషిస్తుంది. అందులో మూడు లక్షల కంపెనీల సమాచారమే ఉంది. వీటి మూల ధన పెట్టుబడి క్రియాశీల కంపెనీల పెట్టుబడిలో మూడింట ఒక వంతు కూడా ఉండదు. ఎన్.ఎస్.ఎస్.ఒ. వెల్లడించిన అంశాలను చూస్తే ప్రైవేటు కార్పొరేట్ రంగం వ్యవహారాల్లో అనేక లొసుగులున్నాయని తేలిపోయింది. మన దేశంలో చాలా కంపెనీలను కార్పొరేట్ రంగంలో చేరడానికే రిజిస్టర్ చేస్తారు కాని ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి చేయడానికి సేవలు అందించడానికి కాదు. అసలు లెక్కలు సమర్పించే కంపెనీల సంఖ్యే తక్కువ అయినప్పుడు కేంద్ర గణాంకాల కార్యాలయం దాదాపు పది లక్షల కంపెనీలు క్రియాశీలంగా పని చేస్తున్నాయని చెప్తోంది. ఇంతకు ముందు చిన్న కంపెనీలకు సంబంధించిన సమాచారం ఉండేది కాదని తాము ఆ సమాచారం అందుబాటులో ఉంచుతున్నామని గణాంకాల కార్యాలయం చెప్తోంది. కాని దీని కోసం అనుసరించే ప్రక్రియ ఎక్కువగా అంచనా వేయడానికి దారి తీస్తోందని విమర్శకులు అంటున్నారు.

తమ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నివేదించని కంపెనీలు బూటకపు కంపెనీలో, మోసపూరితమైనవో కావచ్చు. అసలు కంపెనీలు ప్రారంభించిన వారే లాభాలను దాచడానికి ఇలాంటి నకిలీ కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉండవచ్చు. అందువల్ల క్రియాశీలంగా ఉన్న కంపెనీలు ఇన్ని ఉన్నాయని చెప్పడం వాస్తవం కాకపోవచ్చు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఎన్.ఎస్.ఎస్.ఒ. సర్వేను కొట్టి పారేస్తోంది. ఆర్థిక నివేదికలు దాఖలు చేసే 85 శాతం దాకా ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలలో మూల ధనం ఎంతో ఈ నివేదికల ద్వారా తెలుసుకోవచ్చునంటోంది. కానీ ఎన్.ఎస్.ఎస్. ఒ. సర్వే లెక్కలు దాఖలు చేయవలసిన కంపెనీలకు సంబంధించిందే. అందువల్ల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చే వివరణ ప్రజల మనసుల్లో ఉన్న అనుమానాలను తీర్చడానికి ఉపకరించడం లేదు. ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అంచనా వేయడానికి అనుసరిస్తున్న విధానం నిశిత పరిశీలనకు అవకాశం కల్పించేదిగా ఉండాలి.

GDP new series changes the picture of Indian economy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రశ్నార్థకమైన జి.డి.పి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: