అభ్యర్థుల్లో నేర చరితులు

  2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. 55 మందిపై హత్య, హత్యాయత్నం, 126 మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్రమైన కేసులు నడుస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్నాయి. ఈ సారి నేర చరిత్ర కలిగిన నాయకులు గతంలో కంటే ఎక్కువుగా ఉన్నారు. 8 వేల మంది అభ్యర్థులలో 15 వందల మంది నేర స్వాములే. 19 […] The post అభ్యర్థుల్లో నేర చరితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. 55 మందిపై హత్య, హత్యాయత్నం, 126 మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్రమైన కేసులు నడుస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్నాయి. ఈ సారి నేర చరిత్ర కలిగిన నాయకులు గతంలో కంటే ఎక్కువుగా ఉన్నారు. 8 వేల మంది అభ్యర్థులలో 15 వందల మంది నేర స్వాములే. 19 శాతం మంది తమ నామినేషన్ పత్రాలలో తమపై ఉన్న కేసులను ప్రస్తావించారు.

పోటీ చేసిన ప్రతి ఐదుగురు అభ్యర్థులలో ఒకరు నేర ప్రవృత్తి, నేరారోపణలు కలిగిన వారే. ఎన్నికల నిఘా పెట్టే ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) ఏడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను సమీక్షించింది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులలో నేరారోపణలున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉందని తేల్చి చెప్పింది. వారి 2009లో 15 శాతం మంది ఉండగా, 2014 లో 17 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఏకంగా మరి రెండు శా తం పెరగడం గమనించవలసిన అంశం.

జాతీయ పార్టీలలోనే వారి ఎక్కువగా ఉందని ఈ సర్వేలో తేలింది. బిజెపి, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులలో ప్రతి 10 మందిలో నలుగురు అభ్యర్థులు నేర చరిత్ర కలిగిన వారే. ఈ రెండు పార్టీలలోనూ అభ్యర్థుల సంఖ్య ఐదేళ్లకోసారి పెరగడమే కానీ తగ్గకపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. 2009 లో 27 శాతం అభ్యర్థులపై కేసులున్నాయి, 2014లో వారు 30 శాతానికి పెరిగారు. ఈ సారి ఆ సంఖ్య 40 శాతానికి పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కేరళలో బిజెపి అభ్యర్థి సురేంద్రన్‌పై 240 కేసులున్నాయి. ఇందులో 129 కేసులు తీవ్రస్థాయి నేరాలకు సంబంధించినవి. ఒక కాంగ్రెస్ అభ్యర్థిపై 204 కేసులున్నాయి. నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల్లో ప్రాంతీయ పార్టీలూ తక్కువేం తినలేదు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ 86 మంది నేర చరితులకు టికెట్లు ఇచ్చింది. బిజూజనతాదళ్‌లో మాత్రం 5 శాతం అభ్యర్థులే నేరచరిత కలిగిన వాళ్లున్నారు.

పోటీ చేసే శ్రీమంతుల సంఖ్య ప్రతి ఎన్నికలో పెరుగుతూనే ఉందని సర్వే తేల్చి చెప్పింది. 2014 ఎన్నికల్లో 27 శాతం అభ్యర్థులు కోటీశ్వరులుండగా 2009లో కేవలం 17 శాతం అభ్యర్థులే కోటీశ్వరులున్నారు. ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో 29 శాతం కుబేరులు పోటీలో నిలిచారు. ఇందులో కమలనాధులు 79 శాతం ఉండగా, హస్తవాసులు 71శాతం మంది ఉన్నారు. కాంగ్రెస్ 2009లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 63 శాతం కోటీశ్వర్లుండేలా చూసుకోగా, 2014లో 71శాతానికి చేరింది. బిజెపిలో 2009లో 42శాతం, 2014లో 79 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్, తమిళనాడులో ఎఐఎడిఎంకె పార్టీల అభ్యర్థులంతా కోటేశ్వరులేనని అసోసియేషన్ తేల్చి చెప్పింది. అంతేగాక తమిళనాడులో డిఎంకె అభ్యర్థుల్లో 96 శాతం అభ్యర్థులు కుబేరులేనట. లాలూ పార్టీలో 90 శాతానికిపై పైగా అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఆప్ 60శాతం మంది కుబేరులున్నారు.

సంపన్నులైన స్వతంత్య్ర అభ్యర్థుల వారీగా చూసుకుంటే బీహార్ పాటలీపుత్ర అభ్యర్థి రమేష్ కుమార్ శర్మ ముందంజలో ఉన్నారు. నామినేషన్ పత్రాలలో తాను రూ. 1107 కోట్లకు అధిపతినని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి కె.వి.రెడ్డి 895 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నికిల్ నాథ్ 660కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆర్థిక అభివృద్ధి సూచీ అత్యధికంగా 8.2శాతమే ఉంది. కానీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఆదాయం అంతకంతకూ పెరుగుతూపోయింది. గత ఐదేళ్ల కాలంలో 41 శాతానికి వీళ్ల ఆదాయం పెరిగినట్లు సర్వే సంస్థ తేల్చిచెప్పింది. ఈ సారి 677 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడ్డాయి. గత ఎన్నికల్లో కంటే ఈ సారి పార్టీల సంఖ్య 200 పెరిగింది. 2009లో 368 పార్టీలు పోటీ చేశాయి. గత దశాబ్దకాలంలో రాజకీయ పార్టీల సంఖ్య 84 శాతం పెరిగింది. రాజకీయ పార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

దేశ జనాభాలో 48 శాతం మహిళలున్నా ఎన్నికల బరిలో మాత్రం 9 శాతం మహిళా అభ్యర్థులకే పార్టీలు సీట్లు ఇచ్చాయి. ఎన్నికల వ్యయం అంతకంతకూ పెరుగుతుండటం వల్లనే కోటీశ్వరులైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నారు. డబ్బు, బలం ఎన్నికలను శాసించడం దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కోట్ల రూపాయలు కుమ్మరించి చట్టసభలకు వెళ్లిన అభ్యర్థుల వల్ల అవినీతి పెరుగుతుంది. ఎన్నికల్లో తమ నేరస్వామ్యంతో, డబ్బుతో ఎలాగైనా గెలిచి తీరే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చే పార్టీల తీరు అత్యంత ఆందోళన కలిగించే అంశం.

All party candidates criminal record compete in general election

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అభ్యర్థుల్లో నేర చరితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: