విద్యుత్ వినియోగంలో హైదరాబాద్…

  డిమాండ్‌లో ఈశాన్య రాష్ట్రాలన్నింటికంటే ఎక్కువ హైదరాబాద్: చిమ్మచీకటిలో మగ్గిపోతామన్న ప్రేలాపనలను వెక్కిరిస్తూ తెలంగాణ విద్యుత్ వెలుగులు దేశాన్ని ఆకర్శిస్తున్నాయి. డిమాండ్ ఏటేటా పెరుగుతూ ఉండడం, దానికి తగ్గట్లుగానే నాణ్యమైన కరెంటును నిరంతరం సరఫరా చేయడం సాహసోపేతమే. ఈ సాహసాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగు లు విజయవంతంగా పూర్తిచేస్తూ, రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. తెలంగాణ మొత్తం విద్యు త్ డిమాండ్‌లో అత్యధిక భాగం హైదరాబాద్, శివారు ప్రాంతాలదే. ఈ ఏడాది హైదరాబాద్ గరిష్ట డి మాండ్ 3276 […] The post విద్యుత్ వినియోగంలో హైదరాబాద్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డిమాండ్‌లో ఈశాన్య రాష్ట్రాలన్నింటికంటే ఎక్కువ

హైదరాబాద్: చిమ్మచీకటిలో మగ్గిపోతామన్న ప్రేలాపనలను వెక్కిరిస్తూ తెలంగాణ విద్యుత్ వెలుగులు దేశాన్ని ఆకర్శిస్తున్నాయి. డిమాండ్ ఏటేటా పెరుగుతూ ఉండడం, దానికి తగ్గట్లుగానే నాణ్యమైన కరెంటును నిరంతరం సరఫరా చేయడం సాహసోపేతమే. ఈ సాహసాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగు లు విజయవంతంగా పూర్తిచేస్తూ, రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. తెలంగాణ మొత్తం విద్యు త్ డిమాండ్‌లో అత్యధిక భాగం హైదరాబాద్, శివారు ప్రాంతాలదే. ఈ ఏడాది హైదరాబాద్ గరిష్ట డి మాండ్ 3276 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడా ది 2950 మెగావాట్లుగా ఉంది. పది శాతం వృద్ధితో విద్యుత్ డిమాండ్ రాజధానిలో పెరిగింది.

దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల గరిష్ట డిమాండ్‌ను మించి హైదరాబాద్ ప్రజలు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 13 రాష్ట్రాలను మించిన డిమాండ్ ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉందంటే అది తెలంగాణకే గర్వకారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్న రాష్ట్రా ల్లో హిమాచల్‌ప్రదేశ్(1,387), జమ్మూకాశ్మీర్ (2,826), ఉత్తరఖండ్(1,922), గోవా (594), సిక్కిం(100), జార్ఖండ్ (1,266), అస్సాం (1,712), అరుణాచల్‌ప్రదేశ్ (139), మణిపూర్ (197), మేఘాలయ(336), మిజోరం (116), నాగాలాండ్(157), త్రిపుర(292) తదితర రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలు కలిపి వాడే కరెంటు 2,848కన్నా హైదరాబాద్ నగరం వాడే కరెంటు ఎక్కువ కావడం మరో విశేషం.

పెరిగిన కనెక్షన్లు…

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఐటి పరిశ్రమ వృద్ధి, వాణిజ్య కనెక్షన్లు పెరగడం, గృహ ఉపయోగం పెరగడం వల్ల ఈ వృద్ధి జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాడు నగరంలో 37.8 లక్షల ఎల్.టి. విద్యుత్తు కనెక్షన్లు ఉంటే, నేడు 47.8 లక్షల కనెక్షన్లున్నాయి. ఎల్.టి. కనెక్షన్లలో 27 శాతం వృద్ది సాధించింది. 2014లో 7,067 హెచ్. టి. విద్యుత్ కనెక్షన్లుంటే, నేడు 7,015కు పెరిగాయి. హెచ్.టి. కనెక్షన్లలో 39శాతం వృద్ధి జరిగిం ది. అన్నింటికీ మించి 24 గంటల విద్యుత్ సరఫరా జరగడం వల్ల పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. “హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. కాబట్టి నగరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

పరిశ్రమలు, వ్యాపారం, వాణిజ్యం, కా ర్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా, సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో విద్యుత్ డిమాండ్ లో 10 శాతం స్థిరమైన వృద్ధి ఉంటుందని అంచనా వేశాము. డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే నగరం చుట్టూ 400 కెవి రింగును ఏర్పాటు చేశాం. నాలుగు 400 కెవి సబ్ స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్ స్టేషన్ల కు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం” అని ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు.

Telangana Electrical Lightings Attract the Country

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యుత్ వినియోగంలో హైదరాబాద్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: