రివ్వున ఎగిసిన రిశాట్

  నింగిలోకి మోసుకెళ్లిన పిఎస్‌ఎల్‌విసి 45 ఇస్రో మరో విజయం పలు ప్రత్యేకతల ఉపగ్రహం శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన స్పై శాటిలైట్ రైశాట్ 2 బి ప్రయోగం విజయవంతం అయింది. దీనిని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మొదటి ప్రయోగ స్థావరం నుంచి వాహకనౌక పిఎస్‌ఎల్‌వి సి 45 నుంచి రిశాట్‌ను విజయవంతంగా నిర్ధేశిత కక్షలోకి పంపించారు. ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ శాటిలైట్ భూ పర్యవేక్షకంగా […] The post రివ్వున ఎగిసిన రిశాట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నింగిలోకి మోసుకెళ్లిన పిఎస్‌ఎల్‌విసి 45
ఇస్రో మరో విజయం

పలు ప్రత్యేకతల ఉపగ్రహం

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన స్పై శాటిలైట్ రైశాట్ 2 బి ప్రయోగం విజయవంతం అయింది. దీనిని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మొదటి ప్రయోగ స్థావరం నుంచి వాహకనౌక పిఎస్‌ఎల్‌వి సి 45 నుంచి రిశాట్‌ను విజయవంతంగా నిర్ధేశిత కక్షలోకి పంపించారు. ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ శాటిలైట్ భూ పర్యవేక్షకంగా పరిభద్రమిస్తుంది. మంగళవారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్ తరువాత శ్రీహరికోట నుంచి తెల్లవారు జామున 5.30 నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి నుంచి ఈ ఉపగ్రహం అన్ని అంచనాలకు అనుగుణంగా కక్షలోకి నిప్పులు చిమ్ముకుంటూ వెళ్లడంతో పిఎస్‌ఎల్‌వి ఘనతకు తిరుగులేకుండా పోయింది. ఇక దేశం పరాయి దేశాల కదలికలను నిఘా పెట్టేందుకు అవసరం అయిన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చుకుంది. రైశాట్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇది దట్టమైన మబ్బుల నుంచి కూడా దూసుకువెళ్లగల్గుతుంది. అటు సైనిక ఇటు పౌర వ్యవస్థలకు అవసరం అయిన నిఘా సేవలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. భద్రతా బలగాల సామర్థాన్ని ఇనుమడింపచేస్తుంది. ప్రత్యర్థుల కార్యకలాపాలపై డేగ కన్నుతో, మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి వర్నె తెచ్చే ఈ శాటిలైట్‌ను గూఢచార ఉపగ్రహంగా దీనికి ఇస్రో వర్గాలు ముద్దు పేరు పెట్టాయి. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై కన్నేసి ఉంచేందుకు , వారి కార్యకలాపాలను తెలుసుకుని ఉగ్రవాద చర్యలు కట్టడి చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపకరిస్తుంది. ఈ తరహాలోని రైశాట్‌ను 2009లో విజయవంతంగా ప్రయోగించారు. అయితే ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రైశాట్ 2 బి కాలపరిమితి ఐదేళ్లుగా ఉంటుంది. ఓ వైపు భూ వాతావరణాన్ని పసికడుతూ, ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని అందిస్తూనే , ఈ ఉపగ్రహం శత్రు కదలికలపై క్రోడీకరణలతో ఈ శాటిలైట్ బహుముఖ సన్నద్ధతను సంతరించుకుందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో బహుముఖ విస్తారిత ప్రయోజన లక్షితంగా ఉన్న ఈ శాటిలైట్‌ను నిర్ధేశిత కక్షలోకి చేర్చేందుకు ఇస్రో విశ్వసనీయతల పిఎస్‌ఎల్‌వినే వాహక నౌకగా మారింది.

615 కిలోల బరువు ఉపగ్రహం
క్షేత్రస్థాయిలో నిఘా ఒక్కటే కాకుండా వ్యవసాయ సమాచారం, అటవీ ప్రాంతాలు, వంటివాటిపై కూడా శాటిలైట్ సమాచారం అందిస్తుంది. రాకెట్ నుంచి పేల్చిన తరువాత 15 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో శాటిలైట్ నిర్ణీత కక్షలోకి చేరుకోవడంతో ఇస్రో మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్ధేశిత 555 కిలోమీటర్ల కక్షలోకి శాటిలైట్‌ను పిఎస్‌ఎల్‌వి అనుకున్న విధంగా చేర్చిందని, ఇది అత్యంత గర్వకారణం అని ఇస్రో ఛైర్మన్ కె శివన్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందించారు. ఇది 37 డిగ్రీల ఎటవాలుగా పరిభ్రమిస్తోంది. పిఎస్‌ఎల్‌వికి సంబందింనంత వరకూ ఇది అత్యంత కీలకమైన పరీక్ష, ఇస్రో విజయ యాత్ర కొనసాగింపు అని తెలిపారు.

ఈ ప్రయోగంతో ఇప్పటికీ దీని ద్వారా అంతరిక్షంలోకి 354 శాటిలైట్లను పంపించడం జరిగిందని, అంతరిక్షంలోకి 50 టన్నుల సాంకేతిక పరిజ్ఞానపు బరువులను పంపించిన రికార్డును నమోదు చేసుకుందని వెల్లడించారు. ఇది చాలా చాలా కీలకమైన ప్రయోగం అని తేల్చిచెప్పారు. పిఎస్‌ఎల్‌వి ద్వారా ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానపు ప్రాసిసర్‌ను, తక్కువ వ్యయపు కంప్యూటర్ సంచలిత దిక్సూచీ వ్యవస్థల బరువును కూడా స్పేస్‌లోకి పంపించిందని తెలిపారు. ఇప్పటి శాటిలైట్ అధునాతన అబ్జర్వేటరీ శాటిలైట్ అని, దీనిలో అత్యంత సంక్లిష్టపు నూతన సాంకేతికను కూడా అనుసంధానించడం జరిగిందని, , ఈ రేడియల్ రిబ్ యాంటెనాతో భవిష్యత్తులో అవసరమైన సాంకేతికత అందుతుందని వివరించారు. ఇక ఇస్రో తదుపరి ప్రయోగం చంద్రయాన్ 2 అని ఇది భారత్‌కు అంత్యంత ప్రతిష్టాత్మకం, కీలక మైలురాయి అవుతుందని స్పష్టం చేశారు. జులై 9 16 మధ్యలో ఈ ప్రయోగం ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు.

ISRO Successfully Launches Satellite RISAT-2B

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రివ్వున ఎగిసిన రిశాట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: