ఇస్రో శాస్త్రవేత్తలకు కెటిఆర్ అభినందన

ట్విట్టర్ వేదికగా ప్రశంసలు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇస్రో శాస్త్రవేత్తలను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు వారిని ఆయన ప్రశంసించారు. భారతీయులు గర్వపడేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని కెటిఆర్ ట్విట్టర్‌లో ప్రశంసించారు. కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇక నుంచి ఆకాశం నుంచి నిఘా వేయొచ్చని ఆమె పేర్కొన్నారు. శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ […] The post ఇస్రో శాస్త్రవేత్తలకు కెటిఆర్ అభినందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ట్విట్టర్ వేదికగా ప్రశంసలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇస్రో శాస్త్రవేత్తలను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు వారిని ఆయన ప్రశంసించారు. భారతీయులు గర్వపడేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని కెటిఆర్ ట్విట్టర్‌లో ప్రశంసించారు. కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇక నుంచి ఆకాశం నుంచి నిఘా వేయొచ్చని ఆమె పేర్కొన్నారు. శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్‌ఎల్-సి46 వాహక నౌక 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని 555 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం భారత సరిహద్దుల్లో రక్షణశాఖకు ఎంతగానే ఉపయోగపడనుంది. రాత్రి, పగలు మాత్రమే కాదు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా నింగి నుంచి నిఘా వేయడంలో ఈ ఉపగ్రహం కీలకపాత్ర పోషించనుంది.

KTR congratulates ISRO for successful launch of PSLV-C46

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇస్రో శాస్త్రవేత్తలకు కెటిఆర్ అభినందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: