బ్రహ్మోస్ క్షిపణి ఏరియల్ వెర్షన్ ప్రయోగం విజయవంతం

  న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ఏరియల్ వెర్షన్‌ను ఎస్‌యు 30 ఎంకెఐ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా విజయవంతంగా పరీక్షించినట్టు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) బుధవారం తెలిపింది. 2.5 టన్నుల బరువు కల ఈ క్షిపణి ద్వారా ఆకాశం నుంచి భూమిపై 300 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయవచ్చు. ఐఎఎఫ్ పోరాట సామర్థాన్ని ఇది గణనీయంగా పెంచుతుందని సైనిక అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి మాక్ 2.8 వేగంతో ( ధ్వనికంటే మూడు […] The post బ్రహ్మోస్ క్షిపణి ఏరియల్ వెర్షన్ ప్రయోగం విజయవంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ఏరియల్ వెర్షన్‌ను ఎస్‌యు 30 ఎంకెఐ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా విజయవంతంగా పరీక్షించినట్టు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) బుధవారం తెలిపింది. 2.5 టన్నుల బరువు కల ఈ క్షిపణి ద్వారా ఆకాశం నుంచి భూమిపై 300 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయవచ్చు. ఐఎఎఫ్ పోరాట సామర్థాన్ని ఇది గణనీయంగా పెంచుతుందని సైనిక అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి మాక్ 2.8 వేగంతో ( ధ్వనికంటే మూడు రెట్ల వేగం) ప్రయాణిస్తుంది. ‘ఈ రకమైన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. మరే దేశపు వైమానిక దళం ఈ ప్రయోగం చేయలేదు. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ఈ ప్రయోగం ఎలాంటి ఆటంకం లేకుండా సున్నితంగా జరిగింది. ఉపరితల లక్ష్యాన్ని ప్రత్యక్షంగా ఛేదించే ముందు ఈ క్షిపణి నిర్ణీత పథంలో దూసుకెళ్లింది’ అని ఐఎఎఫ్ ప్రతినిధి, గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు.

IAF successfully test fires aerial version of BrahMos missile

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్రహ్మోస్ క్షిపణి ఏరియల్ వెర్షన్ ప్రయోగం విజయవంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: