ఫార్మా రంగానికి హైదరాబాద్ వేదిక

   పారిశ్రామికాభివృద్ధి కోసం రహదారుల విస్తరణ  ఫార్మా ఎగుమతుల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం  టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్మా బయోటెక్ లైఫ్ సైన్సెస్‌కు పర్యాయపదంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఈ గుర్తింపు తీసుకరావడానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలే కారణమని ప్రశంసించారు. బుధవారం నగరంలో పార్కు హయత్‌లో జరిగిన ఒడిస్సీ లాజిస్టిక్ రెండవ వార్షికోత్సవ సభకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […] The post ఫార్మా రంగానికి హైదరాబాద్ వేదిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 పారిశ్రామికాభివృద్ధి కోసం రహదారుల విస్తరణ
 ఫార్మా ఎగుమతుల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం
 టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్మా బయోటెక్ లైఫ్ సైన్సెస్‌కు పర్యాయపదంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఈ గుర్తింపు తీసుకరావడానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలే కారణమని ప్రశంసించారు. బుధవారం నగరంలో పార్కు హయత్‌లో జరిగిన ఒడిస్సీ లాజిస్టిక్ రెండవ వార్షికోత్సవ సభకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, దేశంలోని ఫార్మా ఎగుమతులలో మూడవ వంతు తెలంగాణ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందన్నారు. ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత ఐదేళ్ళుగా జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో జరిగిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రానికి 2800 కిలోమీటర్ల జాతీయ రహదారులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన ప్రశంసించారు. విస్తృతమైన రోడ్ల అనుసంధానంతో పారిశ్రామిక ఎగుమతి, దిగుమతులు వేగవంతం అవుతున్నాయని కెటిఆర్ చెప్పారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో అభివృద్ధి పనుల వేగం కొంత మేరకు తగ్గిందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఫార్మా సిటిగా 19వేల ఎకరాలతో హైదరాబాద్ నిలిచిందన్నారు. లాజిస్టిక్ పార్కుకు అనుసంధానంగా ఆరుమార్గాలలో మెట్రోరైల్‌ను విస్తరించనున్నట్లు కెటిఆర్ తెలిపారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల వల్ల లాజిస్టిక్ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. డ్రైపోర్టు నిర్మాణాల పూర్తి అయితే మరింత చౌకగా ఎగుమతి, దిగుమతులు జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ మౌళిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని కెటిఆర్ చెప్పారు. మేకిన్ ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రొత్సహించడంతో పాటు మరింత చేయూతనిస్తామన్నారు. ఫార్మా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహాకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.

KTR attend to Odyssey Logistics 2nd Anniversary at Hyd

The post ఫార్మా రంగానికి హైదరాబాద్ వేదిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: