ఒక్కో రౌండ్‌కు అరగంట…

  రాష్ట్రంలో ఉదయం 5గం.కే తెరుచుకోనున్న స్ట్రాంగ్ రూమ్‌లు కౌంటింగ్ కేంద్రాలకు 100మీటర్ల పరిధిలో 144సెక్షన్ ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ ఫలితం వెల్లడి గ్రేటర్‌లో మొదట హైదరాబాద్ రిజల్ట్ కొన్ని స్థానాల్లో 15నుంచి20 రౌండ్లలో ఫలితాలు ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ ఫలితం ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్ రూంలు తెరవనున్న అధికారులు హైదరాబాద్ : నేడు ప్రకటించే పార్లమెంట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ పార్లమెంట్ ఫలితం వెల్లడి […] The post ఒక్కో రౌండ్‌కు అరగంట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రంలో ఉదయం 5గం.కే
తెరుచుకోనున్న స్ట్రాంగ్ రూమ్‌లు

కౌంటింగ్ కేంద్రాలకు 100మీటర్ల పరిధిలో 144సెక్షన్
ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ ఫలితం వెల్లడి
గ్రేటర్‌లో మొదట హైదరాబాద్ రిజల్ట్
కొన్ని స్థానాల్లో 15నుంచి20 రౌండ్లలో ఫలితాలు

ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ ఫలితం
ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్ రూంలు తెరవనున్న అధికారులు

హైదరాబాద్ : నేడు ప్రకటించే పార్లమెంట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ పార్లమెంట్ ఫలితం వెల్లడి కానున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉదయం ఎనిమిది గంటల నుంచి గురువారం అన్ని జిల్లాలోని వివిధ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 11వ తేదీ తరువాత ఈవీఎం, వీవీ ప్యాట్లను రాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 123 స్ట్రాంగ్ రూంలో భద్రపరచగా, నేడు జరిగే లెక్కింపు కేంద్రాలకు వీటిని కేంద్ర సాయుధ బలగాల నిఘాతో కౌంటింగ్ కేంద్రానికి తరలించనున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

గ్రేటర్ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్ ఫలితం మొదటగా..

గ్రేటర్ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్ లోక్‌సభ ఫలితం తొందరగా వెలువడే అవకాశం ఉండగా, ఆపై సికింద్రాబాద్, చేవెళ్ల చివరకు మల్కాజిగిరి లోక్‌సభ ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో అన్ని శాసనసభ స్థానాల్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ప్రతి నియోజకవర్గంలో ఐదు బూత్‌ల్లో వీవీప్యాట్లలోని స్లిప్పులను లాటరీ పద్ధతిలో తీసి లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఇక దేశంలోనే అత్యధిక ఓటర్లతో రికార్డు సృష్టించిన మల్కాజిగిరి లోక్‌సభ ఫలితం అధికారిక ప్రకటనకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మల్కాజిగిరిలో 500లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 28 ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 30 రౌండ్ల లెక్కింపు పూర్తి చేసే అవకాశం ఉంది. ముందుగా ఈవీఎంల తాళాలు తీసి లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్ పద్ధతిలో అదే వీవీ ప్యాట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు 25 నుంచి 30 నిమిషాలు పట్టనుంది.
కొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 రౌండ్లలో ఫలితాలు

కుత్భుల్లాపూర్ ఓట్లను అత్యధికంగా 34 రౌండ్లలో మేడ్చల్, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను 28 రౌండ్లలో లెక్కిస్తారు. అత్యధిక ఓట్లు పోలైన నియోకజవర్గాల్లో లెక్కింపు టేబుళ్లను సైతం 14 నుంచి 24 వరకు ఏర్పాటు చేశారు. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక ఓట్లు నమోదైన శేరిలింగంపల్లి శాసనసభ ఓట్ల కౌంటింగ్‌ను పురస్కరించుకొని 43ఏర్పాటు చేశారు.హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను ఎల్బీ, కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియాలు, ఉస్మానియా యూనివర్సిటీ, రెడ్డి విమెన్స్ కాలేజీ, కోఠి విమెన్స్ కాలేజీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నిజాం కాలేజీ, మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల ఓట్లను పాల్మాకులలోని గురుకుల పాఠశాలలో లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నం కల్లా 15 రౌండ్లు పూర్తి చేసే అవకాశం ఉండడంతో ఫలితాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్ కేంద్రంలో 14 లెక్కింపు టేబుళ్లతో పాటు రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ప్రతి అభ్యర్థి టేబుల్‌కు ఒక ఏజెంట్ చొప్పున 15 మంది ఏజెంట్లకు అనుమతి ఉంటుంది. ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్ రూంలు తెరవనున్న నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బంది ఉదయం ఉదయం 5.30 నిమిషాల వరకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు అందాయి.

Counting of Lok Sabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒక్కో రౌండ్‌కు అరగంట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: