చిత్రకారుడు సుర్యప్రకాశ్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు సుర్యప్రకాశ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయిని ఆర్జించిన చిత్రకారుడిగా సుర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సూర్యప్రకాశ్ ప్రపంచ దేశాలల్లో తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పారని, ఈక్రమంలో చిత్రయయి ఆర్ట్ గ్యాలరీలో ఆయన జీవితకాలంలో చిత్రీకరించిన చిత్రాలతో కూడిన అతిపెద్ద అర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక […] The post చిత్రకారుడు సుర్యప్రకాశ్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు సుర్యప్రకాశ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయిని ఆర్జించిన చిత్రకారుడిగా సుర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సూర్యప్రకాశ్ ప్రపంచ దేశాలల్లో తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పారని, ఈక్రమంలో చిత్రయయి ఆర్ట్ గ్యాలరీలో ఆయన జీవితకాలంలో చిత్రీకరించిన చిత్రాలతో కూడిన అతిపెద్ద అర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు.

కాగా ప్రముఖ చిత్రకారుడు సుర్యప్రకాశ్(78) కన్నుమూశారు. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మొదట ఆయన సిసిఎంబికి రెసిడెన్సియల్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. జెఎన్‌టియూ కాలేజీలో ఫైన్‌ఆర్ట్ అండ్ అర్కిటెక్చర్ కోర్సులో ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1961 నుంచి 1964 వరకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సూర్యప్రకాశ్ ఢిల్లీకి చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు శ్రీరాం కుమార్ వద్ద అప్రెంటిస్‌గా పనిచేశారు.

KCR mourning to journalist Suresh Prakash death

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిత్రకారుడు సుర్యప్రకాశ్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: