అందాలొలికిస్తూ భయపెట్టింది

ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘అభినేత్రి 2’ ఈనెల 31 విడుదల కానుంది. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ హారర్ కామెడీ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘రెడీ రెడీ’ అంటూ సాగే ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందించిన ఈ పాటను నిన్సీ విన్సెంట్ పాడగా వనమాలి సాహిత్యాన్ని అందించారు. లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ‘ఓ మై డార్లింగు బేబీ… నీకోసం ఈ రౌండ్ రౌండు జిలేబీ’ […] The post అందాలొలికిస్తూ భయపెట్టింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘అభినేత్రి 2’ ఈనెల 31 విడుదల కానుంది. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ హారర్ కామెడీ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘రెడీ రెడీ’ అంటూ సాగే ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందించిన ఈ పాటను నిన్సీ విన్సెంట్ పాడగా వనమాలి సాహిత్యాన్ని అందించారు. లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి.

‘ఓ మై డార్లింగు బేబీ… నీకోసం ఈ రౌండ్ రౌండు జిలేబీ’ అంటూ ఫన్నీ పదాలతో ఈ పాట సాగింది. ట్యూన్ కూడా క్యాచీగానే ఉంది. ఇక మిల్కీ బ్యూటీ ఈ పాటలో గ్లామర్‌ను పూర్తిగా ఒలకబోసింది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ అయిన ప్రభుదేవా ముందు నిలబడి తనదైన శైలిలో చెలరేగిపోయి మరీ డ్యాన్స్ చేసింది. తన అందచందాలను ప్రదర్శిస్తూ గ్లామరసం చిందించింది. ఈ పాటలో తమన్నా సోఫా మీద పడుకుని వేసే స్టెప్పును చూసి ఆమెకు దెయ్యం పట్టిందేమోనని భయపడి ప్రభుదేవా ఒక దేవుడి ఫోటో కూడా తీసుకొస్తాడు. అలా భయపెట్టే రేంజ్ లో రెచ్చిపోయింది మిల్కీబ్యూటీ.

‘Abhinetri 2’ movie releasing on May 31st

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందాలొలికిస్తూ భయపెట్టింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: