చైన్ స్నాచింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష

  న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వం చేసిన ఒక చట్ట సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. నేర చట్టం (గుజరాత్ సవరణ) 2018 అనే బిల్లు ప్రకారం గుజరాత్‌లో ఎవరైనా చైన్ స్నాచింగ్ నేరానికి పాల్పడినా, గాయపరిచినా వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. బిల్లుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలిపారని హోంమంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లను దొంగతనంగా మాత్రమే పరిగణించి, […] The post చైన్ స్నాచింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వం చేసిన ఒక చట్ట సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. నేర చట్టం (గుజరాత్ సవరణ) 2018 అనే బిల్లు ప్రకారం గుజరాత్‌లో ఎవరైనా చైన్ స్నాచింగ్ నేరానికి పాల్పడినా, గాయపరిచినా వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. బిల్లుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలిపారని హోంమంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లను దొంగతనంగా మాత్రమే పరిగణించి, ఐపిసి సెక్షన్ 379 కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తున్నారు. ఒక్కోసారి రెండూ విధిస్తున్నారు. 2018 సెప్టెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఐపిసి సెక్షన్ 379కు ఐపిసి 379(ఎ), 379(బి)లను చేరుస్తూ సవరణ చేసింది. ఈ సవరణల వల్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడే వారికి కఠినమైన శిక్ష పడుతుందని ఆ అధికారి తెలిపారు. చైన్ స్నాచర్లకు ఇప్పుడు విధిస్తున్న తేలికపాటి శిక్షలు చాలవని, తరచు బెయిల్ పై బయటికొస్తున్నారని మరో అధికారి చెప్పారు. కొత్త చట్టం ప్రకారం చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించినా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

Chain snatcher to face 10 years imprisonment in Gujarat

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చైన్ స్నాచింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: