దంపతులిద్దరికి ఒకే ఆధా(ర్)రం…

  వికారాబాద్ : దేశంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా విశిష్ఠ గుర్తింపు కార్డు అందజేయాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ప్రత్యేకంగా 12 అంకెలతో కూడిన ఆధార్ నెంబర్‌ను జారీ చేసింది. ఈ ఆధార్ కార్డునే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలకు లింక్ చేసింది. బ్యాంకు ఖాతా తెరవడం దగ్గరనుండి రేషన్ బియ్యం, ఆసరా పించన్లు, రైతుభీమా, రైతుబంధు తదితర అన్ని ప్రభుత్వ పథకాలకూ వర్తింపచేస్తున్నారు. అంచెలంచెలుగా ఆధార్ కార్డు […] The post దంపతులిద్దరికి ఒకే ఆధా(ర్)రం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వికారాబాద్ : దేశంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా విశిష్ఠ గుర్తింపు కార్డు అందజేయాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ప్రత్యేకంగా 12 అంకెలతో కూడిన ఆధార్ నెంబర్‌ను జారీ చేసింది. ఈ ఆధార్ కార్డునే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలకు లింక్ చేసింది. బ్యాంకు ఖాతా తెరవడం దగ్గరనుండి రేషన్ బియ్యం, ఆసరా పించన్లు, రైతుభీమా, రైతుబంధు తదితర అన్ని ప్రభుత్వ పథకాలకూ వర్తింపచేస్తున్నారు. అంచెలంచెలుగా ఆధార్ కార్డు లేనిది ఏ పని కాదు అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన వ్యక్తులను దేశంలోకి అనుమతించకుండా వ్యక్తి జాతీయతను పేర్కొంటూ కార్డులను జారీ చేస్తున్నారు.

ఇదే తరుణంలో వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన కర్రె లక్ష్మయ్య, అంతమ్మ దంపతులకు ఒకే నెంబర్‌తో రెండు వేరువేరుగా ఆధార్ కార్డులు జారీ చేశారు. కార్డులు వేరైనా ఇద్దరి కార్డులపైన ఒకే నెంబర్ ఉండడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. 2013వ సంవత్సరంలో అధికారులు కర్రె లక్ష్మయ్య, కర్రె అంతమ్మల పేరుతో వేరు వేరుగా ఆధార్ కార్డులు జారీచేశారు. 2017వ సంవత్సరంలో భర్త చనిపోయాడు. భర్తకు వచ్చే ఆసరా పించను వితంతు పించను ఇవ్వాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం లేకుండా పోతుందని భార్య కర్రె అంతమ్మ బోరున విలపిస్తుంది. ఐదుగురు సంతానంలో కుమారుడు మృతి చెందగా నలుగురు ఆడబిడ్డల వివాహాలు చేసింది. ప్రస్తుతం ఒంటరిగాఉంటున్న కర్రె అంతమ్మ ఆసరా పించను ఇప్పించాలని గ్రామంలో వేడుకోని నాయకుడు లేడు.

అదికారుల చుట్టూ తిరిగినా ఆధార్ కార్డు మారకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. 2017వ సంవత్సరం నుండి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగినా పనిజరగడం లేదు. ఒకే ఆధార్ నెంబర్‌తో ఆధార్ కార్డు జారీ కావడంతో అన్ని చోట్లా ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవా కేంద్రానికి వెళ్ళి తన రికార్డును సరిచేయమని కోరినా అది సరికావడం లేదు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ కార్డును అనుసందానం చేయడంతో ఏ పథకం కూడా అంతమ్మకు వర్తించడం లేదు. ప్రభుత్వ పరంగా అందించే పథకానికి అంతమ్మ ఆదార్ కార్డును అనుసందానించడానికి ప్రయత్నాలు చేసినా తన భర్త వివరాలను చూయిస్తుంది.  అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని కర్రె అంతమ్మకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

Same Aadhaar Number for Two People

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దంపతులిద్దరికి ఒకే ఆధా(ర్)రం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: