దొంగల ముఠా అరెస్టు

వరంగల్ క్రైం : ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను కొట్టి దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల  దొంగల ముఠాను బుధవారం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల నుంచి  సుమారు రూ.3 లక్షల 63 వేల విలువ గల 15 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మూడు ప్యాసింజర్ ఆటోలు, రెండు సెల్‌ఫోన్లను  స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి నాగరాజు బుధవారం తెలిపారు.  ఐనవోలు మండలం, ముల్కలగూడెంకు చెందిన గువ్వల శివ […] The post దొంగల ముఠా అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్ క్రైం : ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను కొట్టి దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల  దొంగల ముఠాను బుధవారం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల నుంచి  సుమారు రూ.3 లక్షల 63 వేల విలువ గల 15 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మూడు ప్యాసింజర్ ఆటోలు, రెండు సెల్‌ఫోన్లను  స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి నాగరాజు బుధవారం తెలిపారు.  ఐనవోలు మండలం, ముల్కలగూడెంకు చెందిన గువ్వల శివ ,  దోమల రాజు, ,హసన్‌పర్తి మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన అరికెల శ్రీవర్దన్,  రంగశాయిపేట గ్రామానికి చెందిన చాగంటి వంశీ,  నక్కలపల్లి గ్రామాలకు చెందిన ఎర్ర కార్తీక్ లను అరెస్టు చేసినట్టు డిసిపి నాగరాజు తెలిపారు. మన్నె యశ్వంత్, సింగారపు ప్రమోద్‌లు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
నిందితులు ఐదుగురు ఉదయం వరంగల్ రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌రోడ్డు ప్రాంతంలో కలుసుకున్నారు. నెక్కొండ వెళ్లి తిరిగి ఆటోలో వచ్చే క్రమంలో ఆటో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను బెదిరించి చోరీ చేసేందుకు నిందితులు ఆటోల్లో వస్తున్నట్లుగా  పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈస్ట్ జోన్ డిసిపి నాగరాజు, మామునూరు ఎసిపి శ్యాంసుందర్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్ రాజు, పర్వతగిరి ఇన్స్‌పెక్టర్ శ్రీధర్‌రావు తమ సిబ్బందితో కలిసి పర్వతగిరి నుంచి నెక్కొండ పోయే మార్గంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ  సమయంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని   విచారించారు. నిందితులు తమ నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితులను గుర్తించడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డిసిపితో పాటు మామునూర్ ఎసిపి శ్యాంసుందర్, సిసిఎస్ పర్వతగిరి ఇన్స్‌పెక్టర్లు డేవిడ్‌రాజు, శ్రీధర్‌రావు, అసిస్టెంట్ అనాలటిక్ ఆఫీసర్, సల్మాన్, పర్వతగిరి ఎస్సై వీరేందర్, సిసిఎస్ ఎఎస్సై శ్రీనివాసరాజు, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, నజీరుద్దీన్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఈ సందర్భంగా అభినందించారు.

Thieves Gang Arrest at Warangal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దొంగల ముఠా అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: