ఇడ్లీ ప్రియులు మీ కోసం

పాలకూర ఇడ్లీ కావల్సినవి: నానబెట్టిన పెసర పప్పు అర కప్పు, పాలకూర తరుగు ముప్పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి 1 స్పూన్, పెరుగు 1 టీస్పూన్, నీళ్లు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె సరిపడా. తయారీ : ముందుగా మిక్సీ బౌల్‌లో పెసరపప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకొని, అందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు […] The post ఇడ్లీ ప్రియులు మీ కోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాలకూర ఇడ్లీ

కావల్సినవి: నానబెట్టిన పెసర పప్పు అర కప్పు, పాలకూర తరుగు ముప్పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి 1 స్పూన్, పెరుగు 1 టీస్పూన్, నీళ్లు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె సరిపడా.
తయారీ : ముందుగా మిక్సీ బౌల్‌లో పెసరపప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకొని, అందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసి, మిశ్రమాన్ని పెట్టుకోవాలి. తర్వాత స్టీమర్‌లో ఈ పాత్రలను పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత వాటిని వేడివేడిగా ఉన్నప్పుడు ఏదైనా చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ట్రై చేయండి.

రాగి ఇడ్లీ

కావల్సినవి: రాగిపిండి 1కప్పు, నానబెట్టిన మినపప్పు అరకప్పు, నానబెట్టిన ఇడ్లీ రవ్వ 1 కప్పు, ఆవాలు1 టీస్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1 టీస్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, కరివేపాకు రెమ్మలు3, ఉప్పు తగినంత.
తయారీ: నానబెట్టిన మినప పప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఓ బౌల్‌లో ఈ మినపప్పు పేస్ట్, రాగి పిండి, ఇడ్లీ రవ్వ, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగేవరకు కలపాలి. స్టవ్‌ఆఫ్ చేసి, దాంట్లో రాగిపిండి మిశ్రమం వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసి, అందులో పిండిని వేసి స్టీమర్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటిని ఏదైనా చట్నీ లేదా కారంపొడితో సర్వ్ చేసుకోవచ్చు.

సేమియా

కావల్సినవి : దోరగా వేయించిన సేమియా 2 కప్పులు, క్యారెట్ తురుము అర కప్పు, కొత్తిమీర తరుగు ఒక కప్పు, అల్లం పేస్ట్ అర టీస్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1 , ఆవాలు 1 టీస్పూన్, ఉప్పుతగినంత, నూనె సరిపడా, పెరుగు1 కప్పు, శనగపప్పు 1 స్పూన్, మినప పప్పు 1 స్పూన్.
తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్‌పెట్టి, నూనె పోయాలి. అది వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి రోస్ట్ చేసుకొని దింపేయాలి. తర్వాత అందులో సేమియా, క్యారెట్ తురుము, అల్లం పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా నూనె కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసి, ఈ మిశ్రమాన్ని అందులో పెట్టి 10 నిమిషాల పాటు స్టీమర్‌లో ఉడికించుకోవాలి. తర్వాత బయటకి తీసి, వేడివేడిగా ఉన్నప్పుడు ఏదైనా చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇడ్లీ ప్రియులు మీ కోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.