వాహ్… 100 కేజీలు లిఫ్ట్ చేసిన సమంత

హైదరాబాద్‌ : ప్రముఖ నటి సమంత ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యమిస్తారో అందరికీ తెలిసిందే. చాలా సార్లు ఆమె ఎక్సర్ సైజ్ చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారేవి. ఇదిలా ఉండగా తాజాగా ఆమె వంద కిలోలను లిఫ్ట్ చేశారు. ఈ వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. సమంత వంద కిలోలను లిఫ్ట్ చేయడం పై నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. […] The post వాహ్… 100 కేజీలు లిఫ్ట్ చేసిన సమంత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : ప్రముఖ నటి సమంత ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యమిస్తారో అందరికీ తెలిసిందే. చాలా సార్లు ఆమె ఎక్సర్ సైజ్ చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారేవి. ఇదిలా ఉండగా తాజాగా ఆమె వంద కిలోలను లిఫ్ట్ చేశారు. ఈ వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. సమంత వంద కిలోలను లిఫ్ట్ చేయడం పై నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. సమంత మామూలు మహిళ కాదని, ఐరన్ లేడీ అంటూ కొనియాడారు. సమంత వంద కిలోలను లిఫ్ట్ చేయడంపై ఆమె స్నేహితురాలు మల్లిక మైలవరపు ట్వీట్ చేశారు. సమంత వందకిలోలను లిఫ్ట్ చేయడం ఆశ్చర్యకరమని, సమంత ఫీస్ట్ టు బీస్ట్ అని, సమంతలో ఊహించలేనంత బలం ఉందని ఆమె కొనియాడారు. ఆమె ట్వీట్ కు సమంత నవ్వుతున్న ఎమోజీలను పోస్టు చేశారు. సమంత తన భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆమె నుటించిన ‘ ఓ బేబీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుకుంటుంది. అంతేకాక మన్మథుడు -2లో సమంత ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

 

 

Actress Samantha Lifting 100kg

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వాహ్… 100 కేజీలు లిఫ్ట్ చేసిన సమంత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: