టిక్ టాక్ సెలబ్రిటీ బాడీలో 13 బుల్లెట్లు

  ఢిల్లీ: టిక్‌టాక్ సెలబ్రిటీని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వీడియో షేరింగ్ టిక్‌టాక్‌లో మోహిత్ మోర్ అనే యూజర్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోహిత్ ఓ ఫోటో స్టూడియోలోని సోఫాలో కూర్చునప్పుడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. దీంతో మోహిత్ ఘటనా స్థలంలోనో దుర్మరణం చెందాడు. ఆ దృశ్యం అక్కడ ఉన్న సిసి కెమెరాలో […] The post టిక్ టాక్ సెలబ్రిటీ బాడీలో 13 బుల్లెట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: టిక్‌టాక్ సెలబ్రిటీని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వీడియో షేరింగ్ టిక్‌టాక్‌లో మోహిత్ మోర్ అనే యూజర్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోహిత్ ఓ ఫోటో స్టూడియోలోని సోఫాలో కూర్చునప్పుడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. దీంతో మోహిత్ ఘటనా స్థలంలోనో దుర్మరణం చెందాడు. ఆ దృశ్యం అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయింది. సిసి ఫుటేజీలో మాత్రం ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించగా మరో వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షలో మాత్రం మోహిత్ శరీరంలో 13 బులెట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే మోర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు క్రిమినల్స్‌ను కాల్చి చంపారు.

TikTok star Mohit Mor shot dead in Delhi

 

 

The post టిక్ టాక్ సెలబ్రిటీ బాడీలో 13 బుల్లెట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: