నేను ఓడితే…

లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం  సాధిస్తానని ఎస్ పి రాంపూర్ లోక్ సభ అభ్యర్థి అజంఖాన్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే ఇవిఎంలలో భారీ అవకతవకలు జరిగినట్లేనని ఆయన పేర్కొన్నారు.  రాంపూర్ నియోజకవర్గ ప్రజలు తనకే మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తన ఓటమిపై కొందరు మాట్లాాడుతున్నారని, ఒకవేళ తాను ఓడిపోతే , ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగనట్లేనని ఆయన తెలిపారు. గురువారం లోక్ సభ […] The post నేను ఓడితే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం  సాధిస్తానని ఎస్ పి రాంపూర్ లోక్ సభ అభ్యర్థి అజంఖాన్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే ఇవిఎంలలో భారీ అవకతవకలు జరిగినట్లేనని ఆయన పేర్కొన్నారు.  రాంపూర్ నియోజకవర్గ ప్రజలు తనకే మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తన ఓటమిపై కొందరు మాట్లాాడుతున్నారని, ఒకవేళ తాను ఓడిపోతే , ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగనట్లేనని ఆయన తెలిపారు. గురువారం లోక్ సభ ఫలితాలు వెలువడనున్నాయి. ఒక్క రోజు ముందు బుధవారం అజంఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే వివిప్యాట్లు, ఇవిఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఇప్పటికే తప్పుబట్టాయి. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తాము ఓటమి పాలైతే , అందుకు ఇవిఎంలే కారణమని ఇటీవల కొందరు బిఎస్ పి అభ్యర్థులు కూడా ఆరోపించారు. ఈ క్రమంలో అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను యుపి బిజెపి నేతలు ఖండించారు. ఓటమి భయంతోనే అజంఖాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

SP Leader Azam Khan Says Tampering EVMs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేను ఓడితే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: